Suriya ET:'నీకు యాక్టింగ్ రాదురా'.. రానాకి 4 గంటలు క్లాస్ పీకిన సూర్య, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 04, 2022, 09:31 AM IST

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. 

PREV
16
Suriya ET:'నీకు యాక్టింగ్ రాదురా'.. రానాకి 4 గంటలు క్లాస్ పీకిన సూర్య, ఆ తర్వాత ఏం జరిగిందంటే..

హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం 'ఎత్తారెక్కుమ్‌ తునిందవన్‌'(ET). పాండిరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత సూర్య మాస్ గెటప్ లో కనిపించబోతున్న చిత్రం ఇది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా భీకరంగా, ధైర్యంగా ఉండేవాడు అనే అర్థంవచ్చేలా టైటిల్ పెట్టారు. దీనితో సూర్య మాస్ విశ్వరూపం ఈ చిత్రంలో చూడొచ్చని అభిమానులు అంచనాలు పెట్టుకుని ఉన్నారు. 

26

మార్చి 10న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానా అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురిచేశాయి. వేదికపై సూర్య, రానా మధ్య ఆసక్తికర సంఘటన జరిగింది. 

36

సూర్య నటించిన పితామగన్( తెలుగులో శివపుత్రుడు) చిత్రంతో ఆయనకు నేను అభిమానిగా మారిపోయా. ఆ తర్వాత చాలా రోజులకు సూర్యని కలిశా. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. నేను నటించిన ఒక చిత్రాన్ని సూర్య ఎడిటింగ్ రూమ్ లో చూశారు. ఆ తర్వాత నన్ను కారులో ఎక్కించుకుని హైదరాబాద్ మొత్తం తిప్పుతూ 4 గంటలపాటు నాన్ స్టాప్ గా క్లాస్ పీకారు. 

46

నువ్వు చేసేది యాక్టింగ్ కాదురా.. ఏదో అలా సద్దేస్తున్నావ్ అని తిడుతూ క్లాస్ పీకారు. రానా ఈ మాటలు చెబుతున్నప్పుడు సూర్య అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ రానా మైక్ వదలకుండా ప్రసంగం కొనసాగించారు. ఆరోజు సూర్య పీకిన క్లాస్ వల్ల నేను భల్లాల దేవుడిగా మారా, డానియల్ శేఖర్ ని అయ్యా.. నా నటన మెరుగైంది అంటూ సరదాగా రానా తెలిపారు. వెంటనే సూర్య మైక్ తీసుకుని నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నటనలో బిగ్ స్టాంప్ గా మారుతున్నావ్ అని ప్రశంసించారు. 

56

బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని కూడా ఈటీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథులుగా హాజరయ్యారు. బోయపాటి మాట్లాడుతూ రజినీకాంత్ తర్వాత తెలుగులో అంతటి క్రేజ్ ఉన్న తమిళ హీరో సూర్య అని ప్రశంసించారు. సూర్య నటించిన సినిమా అంటే తమిళ సినిమా అనే భావన తెలుగు ప్రేక్షకుల్లో ఉండదు అని బోయపాటి అన్నారు. అన్నీ అనుకూలంగా కుదిరాక సూర్య గారితో సినిమా చేస్తానని బోయపాటి అన్నారు. 

66

ఇదిలా ఉండగా ఈటీ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలని మరింత పెంచింది. ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. కట్టప్ప సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

click me!

Recommended Stories