జైల్లో పల్లవి ప్రశాంత్ ని చూసిన ఖైదీలు ఏం చేశారో తెలుసా? ఆ రెండు రోజులు ఏం జరిగిందో బయటపెట్టిన రైతుబిడ్డ 

First Published Mar 27, 2024, 5:53 PM IST

అన్నపూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రెండు రోజులు చంచల్ గూడ జైలులో ఉన్న పల్లవి ప్రశాంత్ అక్కడ ఏం జరిగిందో తాజాగా వెల్లడించాడు... 
 

Pallavi Prashanth


పల్లవి  ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. డిసెంబర్ 17న ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడులు చేసుకున్నారు. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. 

Pallavi Prashanth

పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు రాకముందే పరిస్థితి అదుపు తప్పింది. అల్లరి మూకలు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రాపర్టీ డామేజ్ చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాలని వెనక డోర్ నుండి పంపించారు. 

Pallavi Prashanth


పోలీసుల మాట లెక్క చేయని పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. కాగా ఈ రెండు రోజులు జైల్లో ఏం జరిగిందో పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు.

నాకు రెండు రోజులు కష్టంగా గడిచింది. అన్నం తిన బుద్ధి కాలేదు. రెండు రోజులు తినకుండానే ఉన్నాను. తోటి ఖైదీలు తినమని బ్రతిమిలాడితే తిన్నాను. జైలు కూడు బాగుంది. నన్ను విఐపీ లా ట్రీట్ చేసినా? మామూలుగా ట్రీట్ చేసినా? బాగానే ఉంది. ఖైదీలు అంతా నా దగ్గరకు వచ్చి అన్నా అన్నా అంటుండేవారు. 

Pallavi Prashanth

బిగ్ బాస్ షో ఎవరు గెలిచారని అడిగేవారు. నేను జైలుకు వెళ్ళాక వచ్చిన ఖైదీలు బయట జరిగిన గొడవలు గురించి వాళ్లకు చెప్పేవాళ్ళు. నేను జైల్లో భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేయలేదు. ఎవరో చేసిన  తప్పుకు నేను శిక్ష అనుభవించాను. నేను నేరం చేయలేదని అందరికీ తెలుసు.. 

నేను పారిపోయానని ప్రచారం చేశారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు. వచ్చారు అరెస్ట్ చేశారు. నాకు పట్టిన గతి నన్ను విమర్శించిన వాళ్లకు పట్టవచ్చు. జైలులో చాలా విషయాలు నేర్చుకున్నాను. జీవితంలో రెండు ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఒకటి హాస్పిటల్, మరొకటి జైలు... అని అన్నాడు. 

click me!