శ్రీలీలా రిలాక్స్ టైమ్.. ఇంట్లో ఎలాంటి సేవలు చేయించుకుంటుందో చూడండి..!

First Published | Nov 3, 2023, 11:11 AM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ప్రస్తుతం సినిమాల నుంచి కాస్తా గ్యాప్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన హోమ్ టౌన్ లో రిలాక్స్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 
 

టాలీవుడ్ లో ప్రస్తుతం జోరుగా వినిపిస్తున్న పేరు శ్రీలీలా (Sreeleela). పెళ్లి సందD, ధమాకా చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ సెన్సేషన్ గా మారిపోయింది. దాంతో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. భారీ ప్రాజెక్ట్స్ లో, బడా హీరోల సరసన నటిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. 

రీసెంట్ గా ‘భగవంత్ కేసరి’తో అలరించింది. విజ్జిపాపగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అలాగే మిగిలిన చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగానే ఉంది. అయితే, శ్రీలీలా అటు ఎంబీబీఎస్ కూడా చదువుతుండటంతో సినిమాకు ప్రస్తుతం కాస్తా గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్టడీస్ కోసం బ్రేక్ తీసుకుంది.


ప్రస్తుతం శ్రీలీలా తన హోమ్ టౌన్ ఒంగోలులో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా తను  ఇంట్లో ఎంచక్కా రిలాక్స్ అవుతున్నా వీడియోను పంచుకుంది. ఈ వీడియోతో ఇంట్లో వారు యంగ్ బ్యూటీకి ఎలాంటి సేవలు చేస్తారో కూడా పరిచయం చేసింది. 
 

తల్లి అల్పహారం తినిపిస్తుంటే.. మరో మహిళ శ్రీలీలా కురులకు సాంబ్రాణి పొగను అందిస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటోంది. వీడియోకు ‘అనుభవించు రాజా’ సాంగ్ ను జత చేసి శ్రీలీలా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. తమ అభిమాన హీరోయిన్ కు ఇంట్లో వారు మహారాణిలా సేవలు చేస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 

ప్రస్తుతం శ్రీలీలా సినిమాలకు గ్యాప్ తీసుకుందని తెలుస్తోంది. ఈ సమయాన్ని తన స్టడీస్, పరీక్షల కోసం వినియోగించుకుంటుందంట. ఆ తర్వాత మళ్లీ మిగిలిన ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే ‘ఆదికేశవ’ చిత్ర షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక శ్రీలీలా చేతిలో ఉన్న భారీ చిత్రాలు ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అలాగే నితిన్ సరసన నటిస్తున్న ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ ఫిల్మింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో శ్రీలీలా బిజీగా ఉంది. 

Latest Videos

click me!