ప్రకాష్ రాజ్ లాగా నాగ మణికంఠ, ప్రేక్షకులేమో వెంకీలా.. తొలివారమే విష్ణుప్రియకి బిగ్ షాక్ ?

First Published | Sep 4, 2024, 7:13 AM IST

మొదటి రోజు నుంచి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న నాగ మణికంఠ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. మూడవ రోజు కూడా నాగ మణికంఠ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆల్రెడీ హీటెడ్ ఆర్గుమెంట్ మొదలైపోయింది. హౌస్ మేట్స్ సిల్లీగా అనిపించే అంశాలతో గొడవపెట్టుకుంటున్నారు. కొందరు చెప్పే పాయింట్లు బాగానే ఉన్నప్పటికీ అంత పెద్ద రాద్ధాంతం అవసరం లేదు అనిపిస్తోంది. మూడవ రోజు నామినేషన్స్ కి సంబంధించిన అంశంలో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరిగాయి. 

Naga Manikanta

సోనియా ఆకుల, ప్రేరణ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ రెచ్చిపోయారు. నువ్వు బిగ్ బాస్ హౌస్ కి పిక్ నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి వచ్చావా అంటూ సోనియా.. ప్రేరణని ప్రశ్నించింది. దీనితో ప్రేరణ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇద్దరూ గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. 


మొదటి రోజు నుంచి అటెన్షన్ కోసం ట్రై చేస్తున్న నాగ మణికంఠ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. మూడవ రోజు కూడా నాగ మణికంఠ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. కానీ అవి ఎక్కువగా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. నాగమణికంఠ పదే పదే సింపతీ కోసం ట్రై చేస్తూ.. నా జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాను అంటూ చెబుతున్నాడు. 

నాగ మణికంఠ ఎవరితో సరిగ్గా మాట్లాడడం లేదని అతడిని నబీల్ నామినేట్ చేశారు. దీనితో నాగ మణికంఠ మాట్లాడుతూ రెండేళ్ల పాటు నేను నా ఇంట్లో నాలుగు కోడలా మధ్యే ఉండిపోయా. ఎవరితో మాట్లాడలేదు. ఎంతో డిప్రెషన్ కి గురయ్యా అంటూ తన కష్టాలు చెబుతూ వచ్చాడు. ఒకసారి చెబితే ఒకే కానీ.. సందర్భం వచ్చిన ప్రతి సారీ నాగ మణికంఠ ఏవ్ విషయములు చెబుతుండడంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ప్రకాష్ రాజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పే కవితతో పోల్చుతూ.. ఆడియన్స్ ని వెంకటేష్ తో పోల్చుతో ఆడేసుకుంటుంటారు. మొత్తంగా ఈవారం నాగ మణికంఠ, బెబక్క లాంటి వాళ్ళ నామినేషన్స్ లో ఉండేందుకు ఎక్కువ ఓట్లు ఇతర సభ్యుల నుంచి పడ్డాయి. బుధవారం రోజు కూడా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగనుంది. 

తొలివారం నామినేషన్స్ లిస్ట్ లీక్ అయి వైరల్ అవుతోంది. లీక్ అయిన సమాచారం మేరకు తొలి వారం బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీ, శేఖర్ భాష, విష్ణుప్రియ, సోనియా నామినేషన్స్ లో  తెలుస్తోంది. అయితే వీరిలో చీఫ్ లు ఎవరినైనా సేవ్ చేస్తారా.. ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది బుధవారం తేలనుంది. విష్ణుప్రియ కూడా నామినేషన్స్ లో ఉండబోతున్నట్లు తెలియడంతో అంతా  షాక్ అవుతున్నారు. హౌస్ లో ఉన్న వారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన కంటెస్టెంట్స్ లో విష్ణుప్రియ ఒకరు. బలమైన కంటెస్టెంట్  వేశారు. అయితే ఆమె తొలి వారమే నామినేషన్స్ లో ఉండడం ఊహించని షాకే అని చెప్పొచ్చు. 

Latest Videos

click me!