బిగ్ బాస్ రచ్చ మామూలుగా లేదు.. ఎవరికి వారు ఏమాత్రం తగ్గడంలేదు. వచ్చిన మొదటిరోజే పరిచయాలు చేసుకోవల్సింది పోయి.. శత్రువలు మాదిరి గొడవలు పడటం మొదలు పెట్టారు. ప్రతీ విషయంలో గొడవ పడుతూనే ఉన్నారు. ఇంటికి సబంధించిన విషయాలు కాని.. డ్యూటీస్ కాని.. వంట, రేషన్ ప్రతీ విషయంలో ప్రశాంతంగా మాట్లాడుకోవడం మానేశారు.
చిన్న చిన్న విషయాలకే చిల్లర గొడువలు పడుతున్నారు టీమ్. ఇక ఈరోజు హౌస్ లో గుడ్డు గురించి.. తిండి గురించి ఎవరికి వారు సెపరేట్ అయ్యి పాయింట్లు తీస్తూ వాదించుకోవడం చిరాకు తెప్పించింది.