Bigg Boss Telugu 8: హౌజ్‌లోకి ఈ సారి వాళ్లనే ఎక్కువ దించుతున్న బిగ్‌ బాస్‌.. రేటింగ్‌ కోసం అదిరిపోయే ప్లాన్‌

Published : Jul 28, 2024, 05:06 PM ISTUpdated : Jul 28, 2024, 08:15 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. అయితే ఈ సారి మాత్రం వాళ్లకి ప్రత్యేకమైన ప్రయారిటీ ఇస్తున్నారట.   

PREV
16
Bigg Boss Telugu  8: హౌజ్‌లోకి ఈ సారి వాళ్లనే ఎక్కువ దించుతున్న బిగ్‌ బాస్‌..  రేటింగ్‌ కోసం అదిరిపోయే ప్లాన్‌

బిగ్‌ బాస్‌ ఫీవర్‌ ప్రారంభమైంది. బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్ల ఎంపిక జరుగుతుంది. ఈ సారి ఎవరు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్లకి సంబంధించిన పలు రూమర్స్ వస్తున్నాయి. ఇందులో క్రేజీ కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. 
 

26

ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో `ప్రేమ దేశం` అబ్బాస్‌, రాజ్‌ తరుణ్‌, వినోద్ కుమార్‌, సాయి కిరణ్‌, సనా, విష్ణు ప్రియా, దీపికా, స్వేతా నాయుడు, శివ, తేజూ, బంచిక్‌ బబ్లూ, సుప్రీత ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మంది వస్తారు అనేది పెద్ద సస్పెన్స్. దీంతోపాటు రోజు రోజుకి కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. 
 

36
Bigg boss telugu 8

ఇదిలా ఉంటే ఈ సారి బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి సంబంధించి ప్రత్యేకమైన కేర్‌ తీసుకుంటున్నారు. యూత్‌ని ఆకర్షించే కార్యక్రమాలు చేస్తున్నారట. అందులో భాగంగా ఈ సారి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకి ప్రయారిటీ ఇస్తున్నారట. ఇన్‌ఫ్లూయెన్సర్లలో మంచి క్రేజ్‌ ఉన్న వారిని తీసుకోవాలనుకుంటున్నారట. సెలక్షన్‌లో వారికే ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది.  నాగ్‌ వేరే లెవల్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. 
 

46
Bigg Boss Telugu 8

అయితే దీనికి ఓ కారణం ఉంది. సోషల్‌ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లకి యూత్‌లో ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంటుంది. వారు చేసే వీడియోల్స్, మీమ్స్ వంటివి బాగా వైరల్‌ అవుతున్నాయి. వాళ్లు చేసే రచ్చ బాగా ట్రెండ్‌ అవుతుంటుంది. ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంటుంది. అలాంటి వారిని తీసుకుంటే అది బిగ్‌ బాస్‌ షోకి హెల్స్ అవుతుందని, జనాలకు మరింత మందికి ఈ షో రీచ్‌ అవుతుంది.

56
Bigg boss telugu 8

అంతిమంగా రేటింగ్‌ పెరగడానికి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారట. గత సీజన్లలో రేటింగ్‌ తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సారి వచ్చే కంటెస్టెంట్లతో 40శాతం వరకు ఇన్‌ఫ్లూయెన్సర్స్ ఉండబోతున్నారని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 
 

66
Bigg Boss Telugu 7

నాగార్జున హోస్ట్ గానే ఈ షో రన్‌ కానుంది. ఆయనకిది వరుసగా ఆరోసారి. మూడో సీజన్‌ నుంచి ఆయనే యంకర్‌గా చేస్తున్నారు. ఇక ఈ ఎనిమిదవ సీజన్‌ బిగ్‌ బాస్‌ సెప్టెంబర్‌ మొదటి వారంలో ప్రారంభం కానున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సారి బిగ్‌ బాస్‌ షోలో కొన్ని మార్పులు కూడా చేస్తున్నారట. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories