నాగార్జున పై మనసు పారేసుకున్న బెజవాడ బేబక్క.. మధు నెక్కంటి బ్యాగ్రౌండ్ ఇదే..

First Published | Sep 1, 2024, 9:23 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్ లోకి ఏడవ కంటెస్టెంట్ గా  ఎంట్రీ ఇచ్చారు సోషల్ మీడియా స్టార్ బెజవాడ బేబక్క.. అలియాస్ మధు నెక్కంటి. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? ఎలా స్టార్ అయ్యింది. 
 

Bezawada Bebakka Bigg Boss8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అట్టహాసంగా  ప్రారంభం అయ్యింది. బిగ్ బాస్ హౌస్ స్టార్ట్స్ తో నిండిపోయింది. ఇక సరికొత్త గేమ్ షోతో పాటు.. సరికొత్త లుక్ లె కింగ్ నాగార్జున మెరిసిపోతున్నారు. ఇక హౌస్ లోకి 7వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు బెజవాడ బేబక్క..  ఆమె అసలు పేరు  మధు నెక్కంటి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌, నటి బెజవాడ బేబక్క . ఆమె నెట్టింట్లో చేసే సందడి అంతా ఇంతా కాదు.
 

మధు నెక్కంటి అలియాస్ బెజబాడ బేబక్క.. కరోనా టైంలో తన రీల్స్‌తో బాగా వైరల్‌ అయ్యింది. అందరికంటే డిఫరెంట్ గా రీల్స్ చేయడం ఆమె స్పెషల్. ఇక సోషల్ మీడియాలో బేబక్కకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమెకు భారీగా ఫ్యాన్ బేస్  ఉంది. ముఖ్యంగా  ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌ క్రేజ్‌ ఉంది.
 


వీడియోస్, రీల్స్, సినిమాలు.. ఇలా రకరకాలుగా ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది బేబక్క. ఫన్నీ కంటెంట్ తో నెటిజన్లను నవ్విస్తూ సందడి చేస్తుంటుంది. మల్టీ టాలెంటెడ్ గా నిరూపించుకున్న బేబక్క.. విజయవాడంలో ఉంటూ.. బెజవాడ పేరుతో ఫేమస్అయ్యింది. ఆమె కామెడీయన్ మాత్రమే కాదు మంచి సింగర్, మిమిక్రీ ఆర్టిస్టు కూడా. అందరు మాట్లాడుకుంటే మాటల్లోనే ఫన్నీ కామెంట్స్ తో అదరగొడుతుంది బేబక్క. 

కరోనా టైమ్ లో రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యింది మధు నెక్కంటి.. ఆమె ఈమధ్య వరకూ కూడా  అమెరికాలో ఉంటూ.. రీసెంట్ గా ఇండియాలో అడుగు పెట్టారు.  అమెరికా పౌరసత్వం ఉన్న మధు నెక్కంటి... ఇండియాలో సెటిలో సెటిల్ అయ్యారు. ఇక్కడే సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయారు.మధు నెక్కంటి చేసే రీల్స్ లో ముంచు లక్ష్మీతో చేసిన రీల్స్.. ఆమెను ఇమిటేట్ చేయడం బాగా వర్కైట్ అయ్యింది. 

బెజవాడ బేబక్క అలియాస్ మధు నెక్కంటి  తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా నటించారు.   హీరో శ్రీకాంత్‌ సరసన హీరోయిన్‌గా కూడా నటించింది. అందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి", "24 కిసెస్‌", "మళ్లీ పెళ్లి" వంటి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. తెలుగు ఇండస్ట్రీలో మధు నెక్కంటి దాదాపు గా 20 సినిమాల వరకు చేశారు. అంతే కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనకు బంధువని కూడా ఆమె  ఓ ఇంటర్య్వూలో తెలిపింది.
 

Latest Videos

click me!