నన్ను శత్రువుగా చూస్తే టైటిల్‌ పట్టుకెళ్తా.. నాగార్జున ముందే సవాల్‌ చేసిన శేఖర్‌ బాషా

First Published | Sep 1, 2024, 9:10 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 8లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా శేఖర్ బాషా అడుగుపెట్టాడు. అసలు ఎవరీ శేఖర్ బాషా. బిగ్ బాస్ హౌస్‌లోకి ఎలా అడుగుపెట్టాడు...?

శేఖర్ బాషా... ఫేమస్ ఆర్జే (రేడియో జాకీ), వీజే (టీవీ యాంకర్), ఇంకా క్రీడా వ్యాఖ్యాత (క్రికెట్ కామెంటేటర్) కూడా. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శేఖర్ బాషా.. స్వస్థలం ఏపీలోని కాకినాడ. హైదరాబాద్‌లోని 92.7 బిగ్ ఎఫ్ఎమ్‌లో ప్రసారమయ్యే "కిక్" కార్యక్రమంతో బాగా పాపులర్. టీవీ రంగంలోనూ ఆయన పేరు తెచ్చుకున్నారు. శేఖర్ బాషా ఒక దశాబ్దం పాటు జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ టీవీ ఛానళ్లలో వీజేగా పనిచేశాడు.

RJ Sekhar Basha

2019లో ఇండియా-వెస్టిండీస్ క్రికెట్ సీజన్‌లో శేఖర్ బాషా క్రీడా వ్యాఖ్యాతగా (కామెంటేటర్) వ్యవహరించాడు. రేడియో రంగంలో అతని ప్రతిభకు గుర్తింపుగా, భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన "ఎక్సలెన్స్ ఇన్ రేడియో" (ఐఆర్ఎఫ్) పురస్కారాన్ని 19 సార్లు గెలుచుకున్న ఏకైక భారతీయ ఆర్జేగా నిలిచాడు శేఖర్ బాషా.

2019లో, ఇండియా రేడియో ఫోరమ్ నుంచి "ఉత్తమ రేడియోజాకీ" పురస్కారాన్ని కూడా శేఖర్ బాషా అందుకున్నాడు. 2017లో, "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" సర్వే ప్రకారం.. టీవీ, రేడియో రంగాలలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో మొదటి 10 స్థానాల్లో నిలిచాడు. టీవీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శేఖర్, ఎంటర్టైన్మెంట్ రంగంలో కింగ్‌గానే నిలిచాడు. 

అలాగే, 2016లో పద్మ మోహన పురస్కారం కింద "ఉత్తమ వీజే"గా శేఖర్ బాషా ఎంపికయ్యాడు.

ఇలా, శేఖర్ బాషా తన అద్భుతమైన ప్రదర్శనలతో టీవీ, రేడియో రంగాలలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.


RJ Sekhar Basha

రేడియో రంగంలో అనుభవం, అవార్డులు

శేఖర్ బాషా తన కెరీర్‌లో అనేక అవార్డులను అందుకున్నారు. 2007లో ఇండియా రేడియో ఫోరమ్ (IRF) అవార్డులలో "గురూ హోజ షురో" షోకు "ఉత్తమ రేడియో కార్యక్రమం"గా అవార్డు దక్కింది. రేడియో శ్రోతల్లో అత్యంత ఆదరణ పొందిన ప్రోగ్రాంగా ఈ షో నిలిచింది. శేఖర్ బాషా తన ప్రత్యేకమైన శైలితో "కెవ్వు-కేక" అనే పదాన్ని తెలుగు పరిశ్రమకు పరిచయం చేశారు. ఈ పదం తర్వాత టాలీవుడ్ చిత్రాల్లో, టీవీ కార్యక్రమాల్లో, పాటల్లో ప్రముఖంగా వాడుకలోకి వచ్చింది.

RJ Sekhar Basha

బిగ్ ఎఫ్ఎంలో ప్రయాణం.. 

2007లో శేఖర్ బాషా రెడ్ ఎఫ్ఎమ్ 93.5 నుంచి బిగ్ ఎఫ్ఎమ్ 92.7కి మారారు. "బిగ్ సందడి" షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. 2008లో ఈ షో ఉత్తమ రేడియో కార్యక్రమంగా గుర్తింపు పొందింది. తన రేడియో కెరీర్‌లో, శేఖర్ బాషా "హ్యాపీ మార్నింగ్స్" అనే ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఈ షో ద్వారా 2017లో "ఉత్తమ బ్రేక్‌ఫాస్ట్ షో" అవార్డును అందుకున్నారు.

మారథాన్ ఆర్జే ఫీట్స్...

శేఖర్ బాషా తన రేడియో ప్రయాణంలో నాలుగు మారథాన్ ఆర్జే ఫీట్స్ చేశారు. 2007లో 92.7 గంటలు నాన్-స్టాప్ మారథాన్ నిర్వహించి, తెలుగు రేడియోలో మొదటిసారి సంచలనంగా నిలిచారు. 2008లో 100 గంటల నాన్-స్టాప్ రేడియో ప్రసారంతో మరింత ఫేమస్ అయ్యారు. 2016లో 106 గంటల "ఆన్-వీల్స్" మారథాన్ నిర్వహించి, మొబైల్ ఇంటర్నెట్ ప్రాముఖ్యతను చాటిచెప్పారు. 2018లో ప్లాస్టిక్ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు 92 గంటల నాన్-స్టాప్ మారథాన్ నిర్వహించారు.

RJ Sekhar Basha

సినిమా రంగంలో ప్రయాణం.. ఇక సినిమా రంగంలోనూ శేఖర్ బాషా సుపరిచితుడే. ప్రముఖ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో "వెల్కమ్ - ఒబామా" సినిమాతో శేఖర్ నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. మరికొన్ని సినిమాల్లోనూ పనిచేశారు.

వివాదంలో ఇరుక్కొని...

టాలీవుడ్ యాక్టర్ రాజ్ తరుణ్ - లావణ్య వివాదంలో శేఖర్ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇక్కడ రాజ్ తరుణ్‌కి మద్దతుగా శేఖర్ భాషా లావణ్య ఉన్నాడు. రాజ్ తరుణ్‌కి చెందిన ఇల్లు, డబ్బు కోసమే లావణ్య ఇదంతా చేస్తుందని మీడియా ముందు మాట్లాడటం సంచలనం రేపింది. ఈ క్రమంలో మీడియా ఎదుటే శేఖర్ భాషాని లావణ్య చెప్పుతో కొట్టడంతో సోషల్ మీడియాలో రచ్చగా మారింది.

RJ Sekhar Basha

ఇక, బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 8లోకి అడుగుపెట్టిన శేఖర్ బాషా క్వాలిటీస్‌ మల్లీ టాలెంటెడ్‌, హ్యూమరస్‌, వైరల్‌. బిగ్‌ బాస్‌లోకి అడుగుపెట్టిన తర్వాత నాగార్జున ముందు శేఖర్‌ బాషా ఓపెన్‌గా మాట్లాడాడు. బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి రావడం తన కల అని చెప్పాడు. తనతో కంటెస్టెంట్‌ అందరూ బాగుంటే అంతా ప్రశాంతంగా ఉంటుందని... తనను శత్రువుగా చూస్తే మాత్రం టైటిల్‌ పట్టుకెళతాడని కింగ్‌ నాగార్జున ముందు సవాల్‌ చేశాడు.

Latest Videos

click me!