ఈక్రమంలో చివరి రౌండ్ వరకూ మెహబూబ్, మణింకఠ, హరితేజ, అవినాష్ టాస్క్ లు గెలుస్తూ వచ్చారు. ఇక ఫైనల్ టాస్క్ లో మెహబూబ్ చివరి వరకూ నిలిచి గెలవడంతో.. మెగా చీప్ గా ఎన్నికయ్యారు. అప్పటి వరకూ మెగా చీఫ్ గా ఉన్న నబిల్ తన చేతికి ఉన్న బ్యాండ్ ను మెహబూబ్ కు అందించడం జరిగింది.
ఇక ఈ మెగా చీఫ్ పోటీలో ఓజీ క్లాన్ నుంచి పోటీకి నిలిచిన మణికంఠ.. గట్టి పోటీ ఇచ్చాడు. టాస్క్ లో తన 100 బెస్ట్ అందించాడు. కాకపోతే చివరి నిమిషయంలో గాలి గట్టిగా వీచి.. తాను చేస్తున్న బ్యాలెన్సింగ్ టాస్క్ లో తడబడ్డాడు. ఇక ఈ విషయంలో మణింకఠకు అందరి నుంచి అభినందనలు ఎదురవుతున్నాయి.