చివర్లో యాష్మి, సోనియా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. యాష్మి మణికంఠని నామినేట్ చేస్తూ ఫిజికల్లీ వీక్ అని చెప్పింది. నేను ఎవరితో పోల్చుకున్నా వీక్ కాదు అంటూ మణికంఠ ఆమెపై ఫైర్ అయ్యాడు. అదేవిధంగా యాష్మి.. సోనియాని నామినేట్ చేసింది. ప్లేటు ఎలా తిప్పేయాలో, ఎవరిని ఎలా వాడుకుని వదిలేయాలో సోనియాకి సూపర్ గా తెలుసు అంటూ యాష్మి ఆరోపించింది. దీనితో సోనియా కూడా ఆమెతో వాగ్వాదానికి దిగింది.
నామినేషన్ ప్రక్రియ అంతటితో పూర్తయింది. పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనికా, నబీల్, ప్రేరణ నామినేషన్స్ లో నిలిచారు. చివర్లో బిగ్ బాస్ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చీఫ్ గా ఉన్న నిఖిల్ వీరిలో ఒకర్ని సేవ్ చేయవచ్చు అని తెలిపారు. దీనితో నిఖిల్..నైనికాని సేవ్ చేశారు. దీనితో ఫైనల్ గా నాల్గవ వారం ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అయిన సభ్యులు పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబీల్, ప్రేరణ. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది.