పాపం ఈ కుర్రాడిపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోందే, హౌస్ లో కూడా టార్గెట్ అవుతున్నాడు

First Published | Sep 2, 2024, 3:08 PM IST

నాగ మణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి రోజే ఈ కుర్రాడిపై అందరి ఫోకస్ పడింది. నాగ మణికంఠకి పెద్దగా గుర్తింపు లేదు.

నాగ మణికంఠ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి రోజే ఈ కుర్రాడిపై అందరి ఫోకస్ పడింది. నాగ మణికంఠకి పెద్దగా గుర్తింపు లేదు. సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయ్యాడు. టివి సీరియల్స్, వెబ్ సిరీస్ లలో ఇప్పుడిపుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇంతలో బిగ్ బాస్ తెలుగు 8 లో అవకాశం వచ్చింది. 

ఎంట్రీ ఇచ్చిన తొలి రోజు నుంచే నాగ మణికంఠపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. దీనికి కారణం ఉంది. అనిల్ రావిపూడి హౌస్ లోకి వెళ్లి నాగ మణికంఠతో ముచ్చటించారు. నువ్వు ఎవరి ఫ్యాన్ అని అడిగారు. దీనికి నాగ మణికంఠ నాకు నేనే ఫ్యాన్ అంటూ సమాధానం ఇచ్చాడు. పాటలు ఇష్టమా అంటే.. ఈశ్వరుడిపై వచ్చి ఎలాంటి పాట అయినా ఇష్టమే అని తెలిపాడు. దీనితో అనిల్ రావిపూడి పాట పాడమని అడగగా.. నాగ మణికంఠ విచిత్రమైన హావభావాలతో పాడుతూ అందరినీ ఆకర్షించాడు. 


కానీ ఇది సోషల్ మీడియాలో ట్రోలింగ్ గా మారింది. ఈ కుర్రాడు ఏదో తేడాగా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఓవరాక్షన్ చేస్తున్నాడు అని అంటున్నారు. నాగ మణికంఠ మాట్లాడే విధంగా.. చూసే విధంగా అన్ని విచిత్రంగా ఉన్నాయి. 

Naga Manikanta Bigg Boss8

చూడ్డానికి కుర్రాడిలా అనిపించినా నాగ మణికంఠకి ఆల్రెడీ పెళ్లి అయింది. ఒక కుమార్తె కూడా ఉంది. నాగ మణికంఠ ఏదో విధంగా ఫస్ట్ డే నుంచే హైలైట్ అవుతున్నాడు. దీనితో కొందరు నెటిజన్లు.. ఫస్ట్ డే నుంచే స్క్రీన్ స్పేస్ కొట్టేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Naga Manikanta

నాగ మణికంఠ తన భార్య కూతురుకి దూరంగా ఉంటున్నాడట. కానీ విడిపోలేదని తెలిపాడు. బిగ్ బాస్ లో ఆఫర్ వస్తే తన భార్యే డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసినట్లు నాగ మణికంఠ పేర్కొన్నాడు. ఇక తాజాగా బిగ్ బాస్ ప్రోమో కూడా విడుదలయింది. ఆల్రెడీ నాగ మణికంఠ కేంద్రంగా గొడవలు మొదలైనట్లు అనిపిస్తోంది. 

నిఖిల్ తో నాగ మణికంఠ ఒక విషయం గురించి వాగ్వాదం చేస్తున్నాడు. నువ్వు మాటిమాటికి ఈ టాపిక్ తీసుకురావడం నాకు నచ్చడం లేదు అంటూ నాగ మణికంఠ నిఖిల్ కి చెబుతున్నాడు. 

Latest Videos

click me!