ఈ వీక్ ఆటతీరుకుసబంధించి అందరికి మార్కులు ఇచ్చాడు నాగార్జున. ఆట తీరు మెరుగు పరుచుకున్న శ్రీహాన్, శ్రీ సత్యలలను అభినందించాడు. ఇక ఆటతీరులో వెనుకబడ్డ శ్రీరాజ్, చంటీ, అర్జున్ కల్యాణ్ లను వెనక్కి పంపించేశాడు. కెప్టెన్ గా నిద్రపోయావంటూ శ్రీ రాజ్ కు కూడా పంచులు విసిరాడు నాగార్జున. ఇక ఆట తీరులో గీతూ, ఆదిరెడ్డి,శ్రీ సత్యలు 10 మార్కులు తెచ్చుకుని టాప్ లో నిలిచారు. మరికొందరికి 9మార్కులు రాగా.. కీర్తి, వాసంతి లాంటి వారు అతి తక్కువ మార్కులు తెచ్చుకున్నారు.