గృహలక్ష్మి టీవీ సీరియల్ తో ఫేమస్, జాబ్ వదిలేసి బుల్లితెరపైకి.. నిఖిల్ నాయర్ ఎవరో తెలుసా ?

Published : Oct 12, 2025, 09:34 PM IST

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచయమైన నిఖిల్ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. 

PREV
13
గృహలక్ష్మి ఫేమ్ నిఖిల్ వైల్డ్ కార్డు ఎంట్రీ 

బుల్లితెర ప్రేక్షకులని ఉర్రూతలూగించిన టీవీ సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి ఒకటి. ఈ టీవీ సీరియల్ తో ఫేమస్ అయిన ఓ నటుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆ నటుడి పేరు నిఖిల్ నాయర్. గృహలక్ష్మి సీరియల్ లో ప్రేమ్ పాత్రలో నిఖిల్ నాయర్ ప్రతి ఒక్కరినీ అలరించారు. నిఖిల్ నాయర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడి గురించి కొన్ని ఆసక్తికర వైరల్ అవుతున్నాయి. 

23
నిఖిల్ నాయర్ బ్యాగ్రౌండ్ ఇదే 

నిఖిల్ ఫ్యామిలీ కేరళకి చెందినవారు. బెంగళూరులో స్థిరపడ్డారు. నిఖిల్ నాయర్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అలాగే ఎంబీఏ డిగ్రీ కూడా పొందారు. బెంగళూరులో నిఖిల్ కొంతకాలం భారీ శాలరీతో ఉద్యోగం చేశారు. కనై ఉద్యోగం చేయడం అతడి లక్ష్యం, ఆసక్తి కాదు. ఏదైనా కొత్తగా సాధించాలి అనే తపన ఉంది. 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేయడం అతడికి చిరాకుగా మారింది. దీనితో నటనలో అవకాశాల కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో యాడ్స్ కి కూడా ఆడిషన్స్ ఇచ్చాడు. 

33
నటన కోసం జాబ్ వదిలేసి.. 

అయితే నటనలో పూర్తి స్థాయిలో మెళుకువలు నేర్చుకునేందుకు యాక్టింగ్ క్లాసులకు అంటెండ్ అయ్యేవాడు. ఈ క్రమంలో నటనని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారింది. దీనితో జాబ్ మానేసి పూర్తిగా నటనపై ఫోకస్ పెట్టాడు. ఆ తర్వాత మలయాళీ టీవీ సీరియల్స్ లో నిఖిల్ కి అవకాశాలు మొదలయ్యాయి.  ఇంటింటి గృహలక్ష్మి టీవీ సీరియల్ తో నిఖిల్ తెలుగులో కూడా ఫేమస్ అయ్యారు. అలా సాగిన నిఖిల్ కెరీర్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వరకు చేరుకుంది. నిఖిల్ మలయాళీ కుర్రాడు అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడతారు. 

Read more Photos on
click me!

Recommended Stories