
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక షో కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. కొత్త కంటెస్టెంట్లు బోల్డ్ గా ఉండటం, బోల్డ్ గా మాట్లాడంతో ఆడియెన్స్ కి అది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. కంటెంట్‌నిస్తుంది. గత వారం దివ్వెల మాధురీ, రమ్య మోక్ష, ఆయేషా జీనత్, నిఖిల్ నాయర్, శ్రీనివాసా సాయి, గౌరవ్ గుప్తా వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. పాత కంటెస్టెంట్లలో భరణి, సంజనా, రీతూ చౌదరీ, తనూజ, సుమన్ శెట్టి, దివ్య, డీమాన్ పవన్, కళ్యాణ్, రాము రాథోడ్ ఉన్న విషయం తెలిసిందే.
ఈ వారం హౌజ్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఎవరికి అవకాశం ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరో వారం నామినేషన్‌లో భరణి, తనూజ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమాన్ పవన్, దివ్య ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ ప్రకారం చూస్తే ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఓ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌కి దగ్గరగా ఉండటం గమనార్హం.
లేటెస్ట్ ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నాడు. మిగిలిన వారితో పోల్చితే రాముకి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. సోషల్ మీడియా ఓటింగ్ ప్రచారం రాముకి దాదాపు 11 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత డీమాన్ పవన్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఆయనకు దాదాపు 12 శాతం ఓట్లు నమోదయ్యాయి. శుక్రవారం నమోదయ్యే ఓట్లని బట్టి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది తేలనుంది. అయితే ఈ వారం రాము రాథోడ్ ఎలిమినేషన్‌కి ఎక్కువగా ఛాన్స్ ఉందని టాక్. ఎందుకంటే మిగిలిన వారితో పోల్చితే ఆయనకు బయట ఫాలోయింగ్ తక్కువ. హౌజ్‌లోనూ తన ఇంపాక్ట్ చూపించడం లేదు. డల్ కంటెస్టెంట్లలో ఒకరిగా ఉన్నారు. దీంతో ఆరో వారం బిగ్ బాస్ రాము రాథోడ్‌ని ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏం జరుగుతుందో కొన్ని గంట్లోనే తేలనుంది.
ఇదిలా ఉంటే ఆరో వారం నామినేషన్లలో ఉన్నవారిలో టాప్‌లో తనూజ ఉన్నారు. ఆమె టీవీ నటి కావడంతో స్వతహాగానే మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా పీఆర్ టీమ్ కూడా పనిచేస్తోంది. దీంతో ఆమెకి ఓటింగ్ బాగా పడుతుంది. దీనికితోడు హౌజ్‌లో ఉన్నంతలో జెన్యూన్ కంటెస్టెంట్ అనే కామెంట్ కూడా ఉంది. సిన్సియర్‌గా ఉంటుందని, అనవసరంగా హంగామా చేయదనే టాక్ ఉంది. ఇవన్నీ తనూజకి హెల్ప్ అవుతున్నాయని చెప్పొచ్చు. అందుకే ఆమె టాప్‌లో ఉంది. ఆ తర్వాత సుమన్ శెట్టి రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు బయట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ కారణం కొన్ని వారాల వరకు సుమన్‌శెట్టికి కొదవలేదు. ఆ తర్వాత దివ్య మూడో స్థానంలో ఉంది. నాల్గో స్థానంలో భరణి ఉన్నారు. వీళ్లకి స్ట్రాంగ్ ఓటింగ్ ఉంది. కావున ఆరో వారం ఎలిమినేషన్ కత్తి రాము మీదకు రాబోతుందని బిగ్ బాస్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందనేది రేపటితో క్లారిటీ రానుంది.
నాగార్జున హోస్ట్ గా చేస్తోన్న `బిగ్ బాస్ తెలుగు 9` సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. 15 మంది కంటెస్టెంట్లతో ఈ షో స్టార్ట్ అయ్యింది. ఇందులో తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఐదుగురు కామనర్స్ హౌజ్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఆరుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ, ప్రియా, మర్యాద మనీష్, హరిత హరీష్, శ్రీజ, ఫ్లోరా ఎలిమినేట్ అయిన వారిలో ఉన్నారు. వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు రావడంతో ఆ లెక్క బ్యాలెన్స్ అయ్యింది. షోకి ఇంకా పది వారాలు ఉంది. అంటే ఒక్కో వారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతారు. దీంతో ఫైనల్‌కి ఐదుగురు కంటెస్టెంట్లు టాప్ 5కి వెళ్తారు. అప్పుడు లెక్క సరిపోతుంది. ఇదిలా ఉంటే కన్నడలో మాదిరిగా తెలుగులో కూడా బిగ్ బాస్ షోని నిలిపి వేయాలని కొందరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరి దీనిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.