బిగ్‌ బాస్‌ షో మా సెలబ్రిటీలది, మధ్యలో ఈ కామనర్స్ ఎవరు? ఈ సారి కప్‌ వాళ్లదే.. షాకిచ్చిన నరేష్‌ లొల్లా

Published : Sep 08, 2025, 06:35 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. అయితే తాజాగా కామనర్స్ పై సీరియల్ నటుడు నరేష్‌ లొల్లా షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఈ షో ఉన్నది సెలబ్రిటీల కోసమే అని అన్నారు. 

PREV
14
15 మందితో బిగ్‌ బాస్‌ తెలుగు 9 ప్రారంభం

`బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 9` ఆదివారం సాయంత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. 15 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి తొమ్మిది మంది సెలబ్రిటీలను, ఆరుగురు కామనర్స్ ని కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. వీరిలో భరణి, తనూజ, శ్రష్టి వర్మ, ఫ్లోరా సైనీ, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయెల్‌, రాము రాథోడ్‌, సుమన్‌ శెట్టి, సంజనా గల్రానీ సెలబ్రిటీలుగా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వగా, మర్యాద మనీష్‌, పవన్‌ కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, దమ్ము శ్రీజ, ప్రియాలు, హరీష్‌ కామనర్స్ గా హౌజ్‌లోకి వచ్చారు. వీరిలో కామనర్స్ మెయిన్‌ హౌజ్‌లో, సెలబ్రిటీలు ఔట్‌ హౌజ్‌లో ఉన్నారు. వీరి మధ్య ఫైటింగ్‌ ఎలా ఉండబోతుందో నేటి నుంచి తేలనుంది.

24
కామనర్స్ పై నటుడు నరేష్‌ లొల్లా సంచలన వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే తాజాగా బిగ్‌ బాస్‌ షోపై టీవీ సీరియల్‌ నటుడు నరేష్‌ లొల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్‌ బాస్‌ షో ఉన్నదే సెలబ్రిటీల కోసం అని, మధ్యలో ఈ కామనర్స్ ఎవరు అంటూ ప్రశ్నించారు. కామనర్స్ కి కెమెరాని ఎలా ఫేస్‌ చేయాలో తెలియదు, సెలబ్రిటీలను ఎలా ఎదుర్కొనాలో తెలియదు. సెలబ్రిటీలతో వారు ఎలా తలపడతారు. సెలబ్రిటీల ముందు వాళ్లు నిలువ లేరంటూ షాకిచ్చారు. సెలబ్రిటీల కోసం స్టార్ట్ చేసిన షోలోకి కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారని, రెండు సీజన్ల క్రితమే కామనర్‌ని తీసుకొచ్చారు. అతను చేసిన పెంట, రచ్చ ఎలాంటిదో తెలిసిందే. ఇప్పటికీ ట్రోల్‌ చేస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు కామనర్స్ ని ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు నరేష్‌ లొల్లా. ఈ కామనర్స్ ఐదు వారాలకు మించి ఉండరని సవాల్‌ చేశాడు.

34
సెలబ్రిటీల విషయంలో ట్విస్ట్ ఇచ్చిన నరేష్‌

కానీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చాడు. తాను ఇలా చెబుతానని అనుకుంటారు, కానీ అలా చెప్పను అని, ఈ సారి కామనర్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. సెలబ్రిటీల కంటే కామనర్సే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని తెలిపారు. తాను అగ్నిపరీక్ష ఎపిసోడ్లని చూశానని, ఒక్కొక్కరు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో, ఎంత బాగా ఆడుతున్నారో చూశానని, ఈ సారి వారిని తట్టుకోవడం చాలా కష్టమని, సరైన సెలబ్రిటీ కంటెస్టెంట్లు లేరని తెలిపారు. ఎప్పుడూ టీవీల్లో చూసిన మొహాలే ఈ షోకి వస్తున్నారని తెలిపారు.

44
కామనర్స్ దే ఈ సారి బిగ్‌ బాస్‌ కప్‌

అంతేకాదు బిగ్‌ బాస్‌ తెలుగు 9 విన్నర్‌ ఎవరో కూడా చెప్పేశాడు నరేష్‌ లొల్లా. ఈ సారి బిగ్‌ బాస్‌ కప్‌ కామనర్స్ దే అని తేల్చేశాడు. వాళ్లే కప్‌ సాధించినా ఆశ్చర్యం లేదని, వారిని ఎదుర్కోవడం సెలబ్రిటీలకు చాలా టఫ్‌ అని తెలిపారు. అంతేకాదు కామనర్స్ బ్యాక్‌గ్రౌండ్‌ చూస్తే వాళ్లు జస్ట్ కామనర్స్ కాదు అని, జీవితంలో చాలా సాధించారని తెలిపారు. వాళ్ల గేమ్‌, మైండ్‌ గేమ్‌ వేరే లేవల్‌ అని తెలిపారు. ఈ సారి కప్‌ కామనర్స్ సొంతమని జోష్యం చెప్పాడు నరేష్‌ లొల్లా. ఇప్పుడు ఆయన కామెంట్స్ వైరల్‌గా మారాయి. నరేష్‌ లొల్లా.. `మగువ ఓ మగువ`, `లక్ష్మీ నివాసం` వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories