Sanjana Galrani: ఆ డ్రెస్‌ వేసుకున్నందుకు బాధగా ఉంది.. శివాజీకి సపోర్ట్ చేస్తూ అనసూయకి ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ సంజనా

Published : Jan 07, 2026, 10:34 AM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది సంజనా గల్రానీ. తాజాగా ఆమె శివాజీ చేసిన కామెంట్లకి స్పందించింది. ఆయనకు సపోర్ట్ చేస్తూ, అనసూయ లాంటి వారికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది. 

PREV
15
బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయిన సంజనా గల్రానీ

సంజనా గల్రానీ అంతకు ముందు హీరోయిన్‌గా తెలుగు ఆడియెన్స్ కి బాగా పరిచయం. ప్రభాస్‌ హీరోగా వచ్చిన `బుజ్జిగాడు` మూవీలో సెకండ్‌ లీడ్‌గా చేసి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. మ్యారేజ్‌ చేసుకుని టాలీవుడ్‌కి దూరమయ్యింది. ఇటీవల `బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో ద్వారా మళ్లీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ షో ఆమెకి మంచి క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తెచ్చింది. ఊహించని పాపులారిటీని తెచ్చింది. బిగ్‌ బాస్‌ షోలో ఇమ్మాన్యుయెల్‌కి అమ్మగా వ్యవహరిస్తూ, ఇప్పుడు రియల్ లైఫ్‌ లోనూ చాలా మందికి అమ్మగా మారిపోయింది.

25
బిగ్‌ బాస్‌ షోలో టాప్‌ 5కి వెళ్లిన సంజనా

పాలుతాగే పిల్లాడిని కూడా వదిలేసి బిగ్‌ బాస్‌ షోకి వచ్చిన సంజనా తాను అనుకున్నది సాధించింది. తన ఇమేజ్‌ని మార్చేసుకుంది. తనపై పలు ఆరోపణలు ఉన్నాయి. వాటిని డామినేట్‌ చేసేలా తన ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యిందని చెప్పొచ్చు. చాలా ఇన్నోసెంట్‌ అనే ముద్ర పడింది. అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా టాప్‌ 5 వరకు వెళ్లింది. 5వ స్థానంలో ఎలిమినేట్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఇటీవల ఆమె పలు మీడియా సంస్థలతో ముచ్చటించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన కొడుకు, ఫ్యామిలీ గురించి స్పందించింది. అందులో భాగంగానే హీరోయిన్ల డ్రెస్‌ల గురించి రియాక్ట్ అయ్యింది.

35
శివాజీకి సపోర్ట్ గా సంజనా కామెంట్స్

గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళలు వేసుకోవాల్సిన డ్రెస్‌ గురించి నటుడు శివాజీ చేసిన కామంట్స్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై చాలా మంది హీరోయిన్లు రియాక్ట్ అయ్యారు. అందులో యాంకర్‌, నటి అనసూయ రియాక్ట్ కావడం బాగా వైరల్‌ అయ్యింది. ఆమె చుట్టూ ఈ వివాదం నడిచింది. ఇంకా నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా బిగ్‌ బాస్‌ తో విశేషమైన పాపులరిటీని సొంతం చేసుకున్న సంజనా గల్రానీ స్పందించింది. గ్లామర్‌ షోని ఆమె తప్పుపట్టింది. కంఫర్ట్ డ్రెస్‌ వేసుకోవాలని, అతిగా గ్లామర్‌ చేస్తే అది మీకే ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది.

45
పొట్టి దుస్తులు వేసుకుని తప్పు చేశా- సంజనా

శివాజీ వ్యాఖ్యలను సమర్ధించిన సంజనా.. `ఒకప్పుడు తాను 18, 19ఏజ్‌లో చాలా వరకు గ్లామర్‌ రోల్స్ చేశాను, శ్రుతి మించిన ఎక్స్ పోజ్‌ చేశాను, అవి ఇప్పుడు చూసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. పెళ్లై, పిల్లలు పుట్టాక అలాంటి ఫోటోలు చూస్తే ఇలా ఎందుకు చేశానని బాధపడుతున్నాను. చాలా రిగ్రెట్‌ ఫీలవుతున్నాను. అప్పుడు ఎలా ఉండాలనేది తెలియదు, వెనకాల ఎవరూ లేరు, చెప్పేవారు లేరు, ఫ్యామిలీ కూడా చెప్పలేదు, దీంతో ఇండస్ట్రీలో సర్వైవ్‌ కోసం పొట్టిదుస్తులు వేసుకున్నాను. ఆయా ఫోటోలను చూస్తే ఇప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే తాను కొన్ని వెబ్‌ సైట్లకి ఫోన్‌ చేసి ఆయా ఫోటోలను తీయిస్తున్నాను`అని చెప్పింది సంజనా.

55
అనసూయకి ఇండైరెక్ట్ గా సంజనా కౌంటర్‌

`కొత్తగా వచ్చేవారికి ఆమె సలహాలిస్తూ, మీకు ఏ డ్రెస్‌ కంఫర్ట్ గా ఉంటే వాటిని వేసుకోండి, జీన్స్, కుర్తా, గాగ్రా, శారీ, హాఫ్‌ శారీఇలా ఏది కంఫర్ట్ గా ఉంటే వాటిని ధరించండి, అంతేకాని ఓవర్‌ ఎక్స్ పోజ్‌ చేయకండి, గ్లామర్‌ గా కనిపించడంలో తప్పులేదు, కానీ శ్రుతి మించిన గ్లామర్‌ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇలానే అనిపిస్తుంది. కానీ 35-40 ఇయర్స్ వచ్చాక, మీకు పెళ్లై, పిల్లలు పుట్టాక, వారు మీ ఫోటోలను చూస్తే ఇబ్బంది పడతారు. తాను అనుభవంతో ఈ విషయాన్ని చెబుతున్నాను` అని సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ విషయంలో ఎవరి మాట వినొద్దు అనే విషయాన్ని సంజనా వెల్లడించారు. పరోక్షంగా ఆమె అనసూయ లాంటి వారికి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది. ప్రస్తుతం సంజనా కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories