జూ.ఎన్టీఆర్, హరికృష్ణని కరివేపాకులా పడేశారు, దాని గురించి ఓపెన్ గా మాట్లాడిన ఏకైక స్టార్ హీరో

Published : Feb 24, 2025, 02:35 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అంశాల జోలికి వెళ్లి చాలా కాలం అవుతోంది. 2009 ఎన్నికల నేపథ్యంలో తారక్ తెలుగు దేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పట్లో తారక్ పొలిటికల్ స్పీచ్ లు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి.

PREV
15
జూ.ఎన్టీఆర్, హరికృష్ణని కరివేపాకులా పడేశారు, దాని గురించి ఓపెన్ గా మాట్లాడిన ఏకైక స్టార్ హీరో
Jr NTR, Nandamuri Harikrishna

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ అంశాల జోలికి వెళ్లి చాలా కాలం అవుతోంది. 2009 ఎన్నికల నేపథ్యంలో తారక్ తెలుగు దేశం పార్టీ కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అప్పట్లో తారక్ పొలిటికల్ స్పీచ్ లు ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి. తారక్ రాజకీయ ప్రసంగాలకు అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓటమి చెందింది. 

 

25
Jr NTR

ఆ తర్వాత నెమ్మదిగా ఎన్టీఆర్ రాజకీయ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా తన సినిమాలపైనే ఫోకస్ పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి నందమూరి హరికృష్ణ కూడా గతంలో చంద్రబాబు హయాంలో తెలుగు దేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. కొంతకాలం తర్వాత ఆయన కూడా పార్టీకి దూరంగా వచ్చి పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. 

 

35

అయితే ఎన్టీఆర్, హరికృష్ణ ఇద్దరినీ చంద్రబాబు దూరం పెట్టారనే ప్రచారం తరచుగా జరుగుతూనే ఉంది. ముఖ్యంగా తారక్ ని అటు తెలుగు దేశం పార్టీ, ఇటు నందమూరి ఫ్యామిలీ దూరం పెట్టారు అని అభిమానులు అంటూనే ఉంటారు. తారక్ టిడిపి కోసం కష్టపడినప్పటికీ చంద్రబాబు కావాలనే సైడ్ చేశారు అనే ప్రచారం ఉంది. చిత్ర పరిశ్రమ నుంచి పోసాని లాంటి వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేయడం చూస్తున్నాం. 

 

45

అయితే హరికృష్ణని, జూనియర్ ఎన్టీఆర్ కరివేపాకులా వాడుకుని పడేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ బహిరంగంగా విమర్శలు చేసిన అగ్ర నటుడు ఒకరు ఉన్నారు. ఆయన ఎవరో కాదు డైలాగ్ కింగ్ మోహన్ బాబు. ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నన్ను చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేశాడు. నాలాగా చాలా మందిని కరివేపాకులా వాడుకున్నారు. అంతెందుకు సొంత కుటుంబ సభ్యులు హరికృష్ణగారిని కొంతకాలం వాడుకుని వదిలేశారు. 

 

55
Jr NTR

హరికృష్ణ కొడుకు, అందరూ అతడిని జూనియర్ ఎన్టీఆర్ అని అంటుంటారు. నాకు బిడ్డ లాంటివాడు కాబట్టి వాడిని తారక అని పిలుస్తా. తారకని కూడా చంద్రబాబు  వాడుకుని వదిలేశాడు అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు చిరకాల మిత్రుడు అని అతడి మాటలకు తాను కూడా మోసపోయానని మోహన్ బాబు అన్నారు. 

 

Read more Photos on
click me!

Recommended Stories