ఆషిక రంగనాథ్ నటించిన వరుసగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోలతో నటిస్తోంది. దీని గురించి ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథ్ ఇటీవల మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. అమిగోస్ చిత్రంతో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కళ్యాణ్ రామ్ సరసన నటించిన అమిగోస్ చిత్రం నిరాశ పరిచింది. ఆ తర్వాత ఆషిక నా సామిరంగ చిత్రంలో నాగార్జున సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆ మూవీ పర్వాలేదనిపించింది.
25
సీనియర్ హీరోలతో రొమాన్స్
నాగార్జునకి ఆషికకి వయసు వ్యత్యాసం 37 ఏళ్ళు ఉంది. అదే విధంగా ఆషిక ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరలో కూడా నటిస్తోంది. చిరంజీవికి ఆమెకి వయసు వ్యత్యాసం దాదాపు 40 ఏళ్ళు. రీసెంట్ గా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో కూడా ఆషిక నటించింది. అంతే కాదు రవితేజతో ముద్దు సన్నివేశాల్లో, రొమాంటిక్ సీన్స్ లో నటించింది. వీరిద్దరికి ఏజ్ గ్యాప్ 28 ఏళ్ళ వరకు ఉంది.
35
హీరోల వయసు పట్టించుకోను
ఇలా వరుసగా ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న హీరోలతో నటించడంపై రీసెంట్ ఇంటర్వ్యూలో ఆషికకి ప్రశ్న ఎదురైంది. అయితే తాను హీరోల ఏజ్ ఎంత అనేది పట్టించుకోను అని ఆషిక పేర్కొంది. సినిమా కథలో నా పాత్ర ఎలా ఉంది అనేది మాత్రమే చూస్తాను. సీనియర్ హీరోనా లేక యంగ్ హీరోనా అనేది చూసుకుని సినిమా చేయను అని ఆషిక తెలిపింది.
నా సామిరంగ చిత్రంలో యంగ్ రోల్ తో పాటు మెచ్యూర్డ్ రోల్ లో కూడా నటించాను. అది ఒక ఎక్స్పీరియన్స్. భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంలో మోడ్రన్ అమ్మాయిగా నటిస్తున్నారు. ఇప్పటి అమ్మాయిలని ప్రతిభింబించేలా నా పాత్ర ఉంటుంది అని ఆషిక పేర్కొంది.
55
రొమాంటిక్ మూవీగా భర్త మహాశయులకు విజ్ఞప్తి
చాలా కాలం తర్వాత రవితేజ మాస్ జోనర్ ని వదిలిపెట్టి ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ జోనర్ కథలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆషికతో పాటు డింపుల్ హయతి కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఒక వైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్యలో నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.