నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ 7న బిగ్ బాస్ తెలుగు 9షో ప్రారంభమైన విషయం తెలిసిందే. 15 మంది కంటెస్టెంట్లతో ఈ షో స్టార్ట్ అయ్యింది. వీరిలో 9 మంది సెలబ్రిటీలు సంజనా, భరణి, శ్రష్టి వర్మ, ఫ్లోరా, సుమన్ శెట్టి, తనూజ, రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరీ రాగా, ఆరుగురు కామనర్స్ మర్యాద మనీష్, హరిత హరీష్, కళ్యాణ్ పడాల, డీమాన్ పవన్, ప్రియా, శ్రీజ హౌజ్‌లోకి అడుగుపెట్టారు. మధ్యలో మరో కామనర్ దివ్య వచ్చారు. వైల్డ్ కార్డ్ ద్వారా దివ్వెల మాధురి, రమ్య మోక్ష, గౌరవ్, శ్రీనివాస సాయి, నిఖిల్, ఆయేషా జీనత్ వచ్చారు. వీరి ఆ తర్వాత వారం నుంచే బ్యాక్ టూ బ్యాక్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఇక టాప్ 5లో కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్, డీమాన్ పవన్, సంజనా ఉన్న విషయం తెలిసిందే. ఇక శనివారం సంజనా, ఇమ్మాన్యుయెల్ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. ఆదివారం మిగిలిన ఎలిమినేషన్‌తోపాటు ఫైనల్ షూట్ చేయబోతున్నారు.