ఫస్ట్ డేనే రచ్చ.. మాస్క్ మెన్ వర్సెస్ మర్యాద మనీష్.. ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కంటెస్టెంట్..

Published : Sep 08, 2025, 12:02 PM IST

Bigg Boss Telugu 9 Promo: బిగ్​బాస్​ తెలుగు సీజన్ 9లో కామనర్స్, సెలబ్రెటీలను బిగ్​బాస్​ హౌజ్​లోకి పంపారు. తొలి రోజే వారి మధ్య గొడవ పెట్టేశాడు బిగ్​బాస్. ఈ సీజన్​కి సంబంధించిన మొదటి ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. మొదటి ప్రోమోలో వైరల్ గా మారింది.

PREV
15
బిగ్‌బాస్ 9 ఫస్ట్ డే నుంచే రచ్చ.

Bigg Boss Today Promo: ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని భావిస్తే.. ఫస్ట్ డే నుంచి వార్ స్టార్ చేశారు. మాస్క్ మెన్ హరీష్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ.. హౌస్ లో అగ్గి రాజేశారు. హౌస్ వర్క్స్ కేటాయింపుల విషయంలో సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ మధ్య వార్ మొదలైంది. ఈ క్రమంలో మాస్క్ మెన్ హరీష్, మర్యాద మనీష్ మధ్య గొడవ ప్రారంభమైంది. ఉత్కంఠ భరితంగా సాగిన నేటి ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో వైరల్ మారింది. మీరు కూడా ఓ లూక్కేయండి. 

25
సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్

ఈ సీజన్‌లో నాగార్జున ముందుగానే సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య రణరంగం జరుగుతుందని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఇద్దరికీ వేర్వేరు హౌస్‌లు కేటాయించారు. అయినా కూడా మొదటి రోజే ఇంటి పనుల విషయంలో రచ్చ మొదలైంది. ఫస్ట్ డే .. ఇంటి సభ్యులు ఎవరు ఏ పనులు చేయాలో నిర్ణయించుకోవడానికి ఒకరికొకరు బ్యాడ్జ్‌లు ఇచ్చుకున్నారు. గిన్నెలు కడిగే పని రీతూ చౌదరికి ఇచ్చాడు కామనర్ పవన్. అయితే హౌస్ క్లీనింగ్ అంటే స్టౌవ్ కడగడమా? కిచెన్ టేబుల్ క్లీనింగ్ కూడా భాగమేనా ? అంటూ డిస్కషన్ మొదలైంది. ఈ చర్చతో హౌస్ ఒక్కసారిగా హీటెక్కింది.

35
హౌస్ క్లీనింగ్ మీదే మొదటి గొడవ..

కిచెన్ క్లీన్ విషయంలో గొడవ.. హౌస్ క్లీనింగ్ అంటే స్టౌవ్ కూడానా అని రీతూ అడిగగా.. హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి.. కిచెన్ టేబుల్ కూడా హౌస్‌ క్లీనింగ్‌లో భాగమేనని హరీష్ చెప్పాడు. వెంటనే ఇమ్మానుయేల్ రియాక్ట్ అవుతూ.. అన్నీ మేం క్లీనింగ్ చేస్తే.. నెక్స్ట్ వచ్చే వాళ్లు కూడా అదే చేయాలి కదా అంటు బదులిచ్చారు. ఆ డీల్ ను ప్రియ రిజెక్ట్ చేసింది. కుక్ చేసేవాళ్లు మాత్రం క్లీనింగ్ చేయరు.. కుక్ ఒక్కరే చేస్తారని తెగేసి చెప్పింది.

45
మధ్యలో మనీష్ జోక్యం.. రెచ్చిపోయిన హరీష్

ఈ క్రమంలో హరీష్ మాట్లాడూతూ.. హౌస్ లో సంజనా గారు ఖాళీగా ఉన్నారు, ఆమె క్లీనింగ్ చేస్తే బావుంటుందని అన్నారు. దాంతో మర్యాద మనీష్ కల్పించుకుని హరీష్ ముందు తన మర్యాద పోగొట్టుకున్నాడు. అది కరెక్ట్ కాదని మనీష్ అనడంతో హరీష్‌ ఫైర్ అయ్యారు. దీంతో మాస్క్ మెన్ హరీష్, మర్యాద మనీష్ మధ్య మాటల యుద్ధం జరిగింది. “నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. నువ్వు మాట్లాడొద్దు” అంటూ హరీష్ వార్నింగ్ ఇవ్వగా, “ఎందుకు మాట్లాడకూడదు?” అంటూ మనీష్ గట్టిగా అరిచాడు. దీంతో హౌస్‌లో మొదటి గొడవ అధికారికంగా స్టార్ట్ అయింది.

55
భరణి ఎంట్రీ.. తగ్గని హరీష్ ఫైర్

ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ అవుతుందని గ్రహించిన భరణి మధ్యలో వచ్చి కూల్ చేయాలని ప్రయత్నించాడు. కానీ హరీష్ మాత్రం తగ్గలేదు. “ఏదైనా అయితే నేను చూసుకుంటా.. అవసరం అయితే ఇంటి నుంచి వెళ్లిపోవడానికైనా రెడీ” అని హరీష్ సవాల్ విసిరాడు. ఇక కుక్ చేసే వాళ్లు కూడా క్లీనింగ్ చేయాలా లేదా? అనే విషయంలో హౌస్‌లో కొత్త డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. ఇలా హౌస్‌ వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఫస్ట్ డేలో ఇలా బిగ్ ఫైట్స్ ఉండవు. కానీ ఈసారి మాత్రం తొలిరోజే రచ్చ మొదలైంది. దీంతో ప్రేక్షకుల్లో కూడా ఈ సీజన్‌పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories