ఎవ్వరూ ఊహించని విధంగా భరణి బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. భరణిని నాన్న అని పిలుస్తూ బాండింగ్ ఏర్పరుచుకున్న తనూజ భరించలేకపోయింది. బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగింది.
దీపావళి ఎపిసోడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో భాగంగా సండే రోజు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చాలా స్పెషల్ గా సాగింది. నటీమణుల ఆటపాటలు, హౌస్ మేట్స్ ఫన్నీ గేమ్స్, నాగార్జున ఎనర్జిటిక్ హోస్టింగ్ తో ఈ ఎపిసోడ్ ఉత్సాహంగా సాగింది. దీపావళి సందర్భంగా కొందరు అతిథులుగా కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ ఎపిసోడ్ ఎంత సరదాగా సాగిందో చివర్లో అంత ఎమోషనల్ గా ముగిసింది. ఎవ్వరూ ఊహించని విధంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
25
నామినేషన్స్ లో ఉన్నది వీరే
నామినేషన్స్ లో తనూజ, రాము, భరణి, పవన్, దివ్య ఉన్నారు. వారికి స్వీట్ బాక్స్ లు ఇచ్చారు. స్వీట్ బాక్స్ లోపల సేఫ్ లేదా అన్ సేఫ్ అని రాసి ఉంటుంది. ఈ రౌండ్ లో దివ్య సేవ్ అయింది. మిగిలిన వాళ్లకు అన్ సేఫ్ అని వచ్చింది. ఆ తర్వాతి రౌండ్ లో తనూజ సేవ్ అయింది. నెక్స్ట్ రౌండ్ లో పవన్ సేవ్ అయ్యాడు. చివరికి భరణి, రాము నామినేషన్స్ లో మిగిలారు. వారిద్దరినీ నాగార్జున యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు.
35
ఇమ్మాన్యుయేల్ వద్ద పవర్ అస్త్ర
అక్కడే అసలైన డ్రామా మొదలైంది. భరణితో ఉన్న ఎమోషనల్ బాండింగ్ వల్ల దివ్య, తనూజ ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. పవర్ అస్త్ర ఇమ్మాన్యుయేల్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. దానిని మూడుసార్లు ఉపయోగించవచ్చు. ఇప్పుడు తొలిసారి దానిని ఉపయోగించి రాము, భరణి లలో ఒకరిని సేవ్ చేసే అవకాశాన్ని నాగార్జున ఇమ్మాన్యుయేల్ కి ఇచ్చారు. ఫైనల్ గా అది ఇమ్మాన్యుయేల్ డెసిషన్. తన పవర్ అస్త్రని ఇమ్మాన్యుయేల్ తర్వాత ఎప్పుడైనా కూడా ఉపయోగించవచ్చు. కానీ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు తన పవర్ అస్త్రని వాడేందుకు అంగీకరించాడు.
భరణి కొన్ని రోజులుగా గేమ్ సరిగ్గా ఆడడం లేదని.. తాను రాముని సేవ్ చేస్తున్నానని ఇమ్మాన్యుయేల్ ప్రకటించాడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో ఎవరు సేవ్ అయ్యారో చూద్దామని నాగార్జున అన్నారు. భరణి రాము ఇద్దరూ క్రాకర్ వెలిగించారు. రాముకి ఎదురుగా గ్రీన్ కలర్ వచ్చింది. భరణికి రెడ్ వచ్చింది. దీనితో అధికారికంగా భరణి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఒక వేళ ఇమ్మాన్యుయేల్ పవర్ అస్త్ర ఉపయోగించకపోయినప్పటికీ రాము సేవ్ అయ్యేవాడు అని నాగార్జున తెలిపారు.
55
భరణి అవుట్.. భరించలేకపోయిన తనూజ, దివ్య
భరణి ఎలిమినేట్ కావడంతో తనూజ, దివ్య భరించలేకపోయారు. భరణిని ఇద్దరూ గట్టిగా కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. తనూజ ఇంతకాలం హౌస్ లో భరణిని తన నాన్నగా భావించిన సంగతి తెలిసిందే. దివ్య తన సోదరుడిగా భావించింది. మీరు ఎప్పటికైనా నా అన్నయ్యే అంటూ దివ్య ఏడ్చేసింది. చాలా ఎమోషనల్ గా తనూజ, దివ్య భరణికి వీడ్కోలు పలికారు. మొత్తంగా టాప్ 5 లో ఉంటారనుకున్న భరణి కాస్త నెల రోజులకే హౌస్ ని వీడడం అందరికీ షాకింగ్ గా అనిపించింది. అంతకు ముందు వేదికపైకి కొందరు అతిథులు వచ్చారు. సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ జటాధర టీం బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. సుధీర్ బాబు, బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, శిల్ప శిరోద్కర్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చి కాసేపు సందడి చేశారు. సోనాక్షి, నాగార్జున తో చాలా బాగా మాట్లాడింది. తమ జటాధర చిత్ర విశేషాలని నాగార్జునకి వివరించింది. ఆ తర్వాత హైపర్ ఆది వేదికపైకి వచ్చి ఒక్కో కంటెస్టెంట్ ని ఆడేసుకున్నాడు. సుమన్ శెట్టి, భరణి, తనూజ, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి ఇలా ఎవ్వరినీ వదలకుండా హైపర్ ఆది వారిపై జోకులు వేస్తూ వారి బలాలు బలహీనతలు తెలియజేశాడు.