రియల్ బోర్డ్ పై విష్ణు ప్రియ, సీత, ప్రేరణ ఫోటోలు.. ఫేక్ బోర్డ్ పై సోనియా, మణికంఠ, ఆదిత్య ఓం ఫోటోలు పెట్టాడు. సోనియా రెండు ముఖాలతో ఉంటోంది. ఆమె చాలా డేంజర్ అన్నట్టుగా చెప్పాడు. మణికంఠ కూడా ఫేస్ లో ఫేక్ ఎమోషన్స్ చూపిస్తున్నాడన్నారు. ఇక విష్ణు ప్రియ అమాయకురాలు అని అన్న శేఖర్.. సీత తన చెల్లెలిగా చెప్పుకున్నాడు.
ఇక ఈ శనివారం ఎపిసోడ్ నాగార్జున శేఖర్ బాషాకు గుడ్ న్యూస్ చెప్పారు. శేఖర్ భాషా కు బాబు పుట్టినట్టు అనౌన్స్ చేశారు. ఆ ఆనందం తట్టుకోలేక బోరున ఏడ్చారు శేఖర్. ఈ గుడ్ న్యూస్ చెప్పడంతోనే అంతా హ్యాపీగా ఉన్న సమయంలో.. ఆయన ఎలిమినేషన్ పెద్ద షాక్ అని చెప్పాలి.