నరసింహ నాయుడులా ఉండాలి, రానా నాయుడులా కాదు..సమంత సెటైర్ కి రానా రిప్లై, పరువు తీశాడు

First Published | Nov 6, 2024, 1:10 PM IST

ఇటీవల అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రానా దగ్గుబాటి, యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ గా చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, హీరో హీరోయిన్లు సందడి చేశారు. ఐఫా ఈవెంట్ లో సమంత కూడా హైలైట్ గా నిలిచింది.

ఇటీవల అబుదాబిలో ఐఫా అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి రానా దగ్గుబాటి, యంగ్ హీరో తేజ సజ్జా హోస్ట్ గా చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు, హీరో హీరోయిన్లు సందడి చేశారు. ఐఫా ఈవెంట్ లో సమంత కూడా హైలైట్ గా నిలిచింది. ఐఫా అవార్డ్స్ లో ఆమెకి వుమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ చేతుల మీదుగా సమంత ఈ అవార్డు అందుకుంది. 

అనంతరం సమంత మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ వచ్చింది. తిరిగి మళ్ళీ రావడం సంతోషంగా ఉంది. ఈ క్రమంలో చాలా ఛాలెంజ్ లో ఎదురయ్యాయి. అన్నీ తట్టుకుని నిలబడ్డాను. మహిళలు ఎవ్వరైనా సరే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మళ్ళీ మళ్ళీ ఎదుగుతూనే ఉండాలి అంటూ సమంత కామెంట్స్ చేసింది. 


ఆ తర్వాత రానా ఆమెని ఆట పట్టించే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు మా సిస్టర్ ఇన్ లా నుంచి సిస్టర్ వరకు వెళ్ళింది అని రానా కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత అసలు నువ్వు తెలుగు సినిమాలు చేయట్లేదు ఏంటి అని ప్రశ్నించాడు. నువ్వెందుకు చెయ్యట్లేదు అని సమంత తిరిగి ప్రశ్నించింది. నన్ను ఎవరూ తీసుకోవట్లేదు అని రానా బదులిచ్చాడు. నాది కూడా అదే పరిస్థితి అని సమంత తెలిపింది. 

అంటే మనం ఒక సినిమా చేస్తున్నాం అంటే అది నరసింహ నాయుడు లా ఉండాలి.. రానా నాయుడులా ఉండకూడదు అంటూ సమంత అదిరిపోయే సెటైర్ వేసింది. రానా కూడా ఏమాత్రం తగ్గలేదు. సమంత పరువు తీసేలా కౌంటర్ ఇచ్చాడు. రానా నాయుడు సినిమా కాదక్కా అది వెబ్ సిరీస్.. వెబ్ సిరీస్ లో ఏమైనా చేసుకోవచ్చు.. నీ ఫ్యామిలీ మ్యాన్ చూసే నేర్చుకున్నాం అంటూ రానా పరువు తీశాడు. రానా నాయుడులో బోల్డ్ సీన్లు వివాదం సృష్టించాయి. అదే విధంగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా బోల్డ్ సీన్లు హాట్ టాపిక్ అయ్యాయి.

తేజ సజ్జా కూడా సమంతపై సెటైర్ వేశాడు. సమంత ఇంత బోల్డ్ గా ఎందుకు మాట్లాడుతుందో తెలుసా.. టాలీవుడ్ లో ఉన్నప్పుడు ఆమె సమంత రూత్ ప్రభు.. బాలీవుడ్ కి వెళ్ళాక సమంత రూడ్ ప్రభు అయింది అంటూ సెటైర్ వేశాడు.  

Latest Videos

click me!