ఇచ్చిన మాట మరిచి జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్... ఇక పొలంలోకి ఏమి వెళతాడు?

Published : Feb 08, 2024, 10:13 AM IST

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్  ఒక మాట ఇచ్చిన విషయం తెలిసిందే. తాను టైటిల్ గెలిస్తే ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని అన్నారు. అయితే ఆ దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు.   

PREV
17
ఇచ్చిన మాట మరిచి జల్సాలు చేస్తున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్... ఇక పొలంలోకి ఏమి వెళతాడు?
Bigg Boss Telugu 7


బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ సెన్సేషన్ గా అవతరించాడు. కామనర్ కోటాలో హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ అయ్యాడు. సీరియల్ నటుడు అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడ్డారు. ప్రేక్షకుల ఓట్లతో పల్లవి ప్రశాంత్ టైటిల్ కైవశం చేసుకున్నాడు. 
 

27
Bigg Boss Telugu 7

విన్నర్ గా పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ బహుమతులుగా అందుకున్నాడు. ప్రేక్షకుల మనసులు గెలిచేందుకు పల్లవి ప్రశాంత్ చాలా కష్టపడ్డాడు. టాస్క్స్, గేమ్స్ లో సత్తా చాటాడు. అలాగే రైతు బిడ్డ ట్యాగ్ కూడా అతనికి బాగా ఉపయోగపడింది. 

 

37
Bigg Boss Telugu 7

కాగా ఒకవేళ తాను టైటిల్ విన్నర్ అయితే ఆ డబ్బులు పేద రైతులకు పంచిపెడతాని హామీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో వేదికగా ఈ మాట పలుమార్లు చెప్పాడు. మరి చెప్పినట్లే పల్లవి ప్రశాంత్ తానూ గెలుచుకున్న డబ్బులు పేద రైతులకు పంచాడా? లేదా ? అనే సందేహాలు మొదలయ్యాయి.

47

షో ముగిసి రెండు నెలలు అవుతుంది. అయినా పల్లవి ప్రశాంత్ పేద రైతులకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. తాను సహాయం చేసిన వీడియోలు షేర్ చేస్తానని. పంచిన ప్రతి రూపాయికి లెక్క చెబుతానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే ఆ సూచనలేమీ కనిపించడం లేదు. 
 

57

పల్లవి ప్రశాంత్ వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేస్తున్నాడు. షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. తన స్పై బ్యాచ్ శివాజీ, ప్రిన్స్ యావర్ లతో పార్టీలు ఎంజాయ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. 

67

రైతుబిడ్డ హోదాతో టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ సామాన్య జీవితాన్ని వదిలేశాడనిపిస్తుంది. ఒకసారి లగ్జరీలకు అలవాటు పడ్డాక ఎండలో చాకిరి చేయడం అంత సులభం కాదు. పల్లవి ప్రశాంత్ ఇకపై వ్యవసాయం చేయకపోవచ్చు అంటున్నారు. 

 

77
Bigg Boss Telugu 7

ఆ మధ్య శివాజీ పల్లవి ప్రశాంత్ ని నటుడు ధనుష్ తో పోల్చాడు. ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లతో సినిమా తీస్తానని కూడా చెప్పాడు. కెరీర్ లో ఎదగాలని ఎవరైనా కోరుకుంటారు. పల్లవి ప్రశాంత్ ఇచ్చిన హామీ ప్రకారం ప్రైజ్ మనీ రైతులకు పంచాలని అంటున్నారు. 

click me!

Recommended Stories