అదే జరిగితే చంపేసే వాడిని, కారు రిపేరుకు ఖర్చు ఎంత అయ్యిందంటే... దాడిపై అమర్ లేటెస్ట్ కామెంట్స్ 

First Published | Feb 15, 2024, 7:03 AM IST


అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. తాజాగా అమర్ మరోసారి ఈ దాడిపై స్పందించాడు. డ్యామేజ్ అయిన కారు రిపేరుకు ఎంత ఖర్చు అయ్యిందో కూడా చెప్పాడు. 
 

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ తెలుగు 7 స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ అన్నట్లుగా సాగింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ ఒకవైపు శోభ, ప్రియాంక, అమర్ దీప్ మరొకవైపు ఉండి, టైటిల్ కోసం పోటీపడ్డారు. పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ గా మిగిలాడు. 

Bigg Boss Telugu 7

హౌస్లో పల్లవి ప్రశాంత్ పట్ల అమర్ దీప్ ప్రవర్తించిన తీరు కొందరికి నచ్చలేదు. అమర్ దీప్ దురుసుగా వ్యవహరించిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ మీద కక్ష పెట్టుకున్నారు. ఫినాలే ముగిసి బయటకు రాగానే... అమర్ దీప్ కారుపై దాడి జరిగింది. 
 


Bigg Boss Telugu 7

కారును అడ్డగించిన కొందరు యువకులు అద్దాలు పగలగొట్టారు. దుర్భాషలు ఆడారు. అతి కష్టం మీద అమర్ దీప్ కుటుంబ సభ్యులతో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ ఘటనపై అమర్ దీప్ ఇప్పటికే పలుమార్లు స్పందించారు. తాజాగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

Bigg Boss Telugu 7

అమర్ దీప్ భార్య తేజస్వినితో పాటు కాఫీ విత్ శోభ టాక్ షోలో పాల్గొన్నారు. శోభ శెట్టి హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో సుమన్ టీవీలో ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా దాడి ఘటన గురించి అడగ్గా... నా తల్లికి ఏమన్నా జరిగి ఉంటే ఎవడో ఒకడిని చంపేసేవాడిని.కారులో కుటుంబ సభ్యులు ఉండగా రాళ్లు విసిరితే మీరు ఒప్పుకోరు కదా... 

Amar Deep

నాకు ఒక సినిమా సీక్వెన్స్ కనిపించింది. నేను కారు దిగిపోతాను. వాళ్లకు కావలసింది నేనే కదా అని అన్నాను. వాళ్ళందరూ నన్ను కొట్టినా ఒకడినైనా నేను కొడతా కదా అనిపించింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు... అని అన్నాడు. 


మరి డ్యామేజ్ అయిన కారు రిపేరుకు ఎంత ఖర్చు అయ్యిందని శోభా శెట్టి అడిగింది. దాదాపు రూ. 3.5 లక్షలు అయ్యిందని అమర్ దీప్ చెప్పుకొచ్చాడు. కాగా బిగ్ బాస్ షో అనంతరం అమర్ దీప్ కెరీర్ బాగానే ఉంది. ఇటీవల హీరోగా ఓ మూవీ లాంచ్ అయ్యింది. రవితేజ మూవీలో అమర్ కి ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే... 

Latest Videos

click me!