Bigg Boss Telugu 7: నువ్వెవరు వెళ్ళమనడానికి శివాజీతో గొడవకు దిగిన శోభా శెట్టి!

First Published | Sep 12, 2023, 11:20 AM IST

నామినేషన్స్ డే అంటే బిగ్ బాస్ హౌస్లో వాదోపవాదనలు చోటు చేసుకుంటాయి. శివాజీ-శోభా శెట్టి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. 
 

Bigg Boss Telugu 7

సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు పంథా మార్చారు. ఒక కంటెస్టెంట్ ని ఎంత మంది నామినేట్ చేయాలనుకుంటున్నారో బయటకు రావాలని అడుగుతున్నారు. ఆట సందీప్ ఇమ్యూనిటీ గెలుచుకున్న విషయం తెలిసిందే. కాబట్టి అతన్ని నామినేట్ చేయడానికి లేదు. అయితే ఆట సందీప్ కూడా ఒకరిని నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. 


ప్రిన్స్ యావర్ హౌస్లో ఉండేదుకు అర్హుడు కాదని ఆట సందీప్ నామినేట్ చేశాడు. నాగార్జున(Nagarjuna) కూడా నాకు మార్క్స్ వచ్చాయని చెప్పారు. నా కంటే తక్కువ మార్క్స్ వచ్చినవాళ్లు ఉన్నారు. నన్నెలా అనర్హుడని నామినేట్ చేస్తావని ప్రిన్స్ యావర్ ఆర్గ్యూ చేశాడు. అనంతరం తేజాను నామినేట్ చేసేవాళ్ళు ఎవరో రావాలని బిగ్ బాస్ ఆదేశించాడు. శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ కారణాలు చెప్పి టేస్టీ తేజాను నామినేట్ చేశారు. 
 


Bigg Boss Telugu 7

తర్వాత దామిని పేరు పిలిచాడు బిగ్ బాస్. అయితే ఆమెను నామినేట్ చేసేందుకు ఎవరూ ముందు రాలేదు. దాంతో ఆమె ఈ వారం నామినేషన్స్ నుండి తప్పుకుంది. తర్వాత నటుడు శివాజీ పేరు పిలిచారు. మొత్తం 5 మంది శివాజీని నామినేట్ చేశారు. అమర్ దీప్ చౌదరి, ప్రియాంక, షకీలా, దామిని, శోభా శెట్టి నామినేట్ చేశారు. వీరిలో ప్రియాంక సింగ్-శివాజీ మధ్య వాడి వేడి చర్చ నడిచింది. 
 

Bigg Boss Telugu 7

ఇక పల్లవి ప్రశాంత్ పేరు పిలవగా గౌతమ్ కృష్ణ, ప్రియాంక సింగ్, అమర్ దీప్ చౌదరి, రంగంలోకి దిగారు. పల్లవి ప్రశాంత్ ని ప్రియాంక, అమర్ దీప్ చౌదరి స్ట్రాంగ్ గా టార్గెట్ చేశారు. నువ్వు రైతు బిడ్డ అని చెప్పుకోవడానికి వీలు లేదు అన్నట్లు వాదించారు. రైతులే కాదు అన్ని రంగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. నువ్వు సింపతీ వాడకు అని అమర్ దీప్ చౌదరి గట్టిగా చెప్పాడు. రైతుబిడ్డ అనే కామనర్ కి భారీగా ఓట్లు పడుతున్నాయని అమర్ దీప్ చౌదరి, ప్రియాంక సింగ్ గ్రహించారు. ఆ సింపతీ యాంగిల్ దూరం చేయాలని గట్టి ప్రయత్నం చేశారు.
 

Bigg Boss Telugu 7

అనంతరం రతికా రోజ్ ని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. పాయింట్ మాట్లాడమని గౌతమ్ కృష్ణ మీద రతికా రోజ్ ఫైర్ అయ్యారు. అయితే శోభా శెట్టి, శివాజీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శోభా శెట్టి నన్ను నామినేట్ చేసింది, అందుకే నేను ఆమెను నామినేట్ చేస్తున్నాను అన్నాడు. ఇది వ్యాలిడ్ పాయింట్ కాదని శోభా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. కొందరు టీమ్ గా ఆడుతున్నారని శివాజీ ఆమెను ఉద్దేశించి ఆడారు. ఎవరూ జట్టుగా ఆడటం లేదని శోభా శెట్టి ఖండించింది. 
 

Bigg Boss Telugu 7

నేను కూడా ఆర్టిస్ట్ నే అని శోభా అనడంతో... అందుకే ఇంప్రెస్ చేస్తున్నావ్ అని శివాజీ వ్యంగంగా అన్నాడు. ఇంప్రెస్ చేయడమేంటనీ శోభా తిరిగి ప్రశ్నించింది. పాయింట్ అదే కదా, గేమ్ లో ఇంప్రెస్ చేశావ్ అన్నాను, అని శివాజీ కౌంటర్ వేశాడు. ఇద్దరూ చాలా సమయం వాదులాడుకున్నారు. మీదకు రావొచ్చని శోభా అన్నారు. మీరు చెబితే నేను హౌస్ నుండి వెళ్లను, బిగ్ బాస్ చెబితే వెళతానంటూ శోభా గొడవకు ముగింపు పలికింది. బిగ్ బాస్ తెలుగు 7(Bigg Boss Telugu 7) ప్రోమోలో ఈ ఆసక్తికర విషయాలు ఉన్నాయి. 
 

Latest Videos

click me!