ముంబయ్ హీరోయిన్ తో సీక్రేట్ గా అఖిల్ ఎంగేజ్మెంట్, సోషల్ మీడియాలో నాగార్జున ప్రకటన.

First Published | Nov 26, 2024, 6:41 PM IST

అక్కినేని వారింట మరో పెళ్లి సందడి. నాగచైతన్య పెళ్ళికి డేట్ దగ్గరపడుతున్న టైమ్ లో.. అఖిల్ పెళ్లి వార్తను ప్రకటించాడు కింగ్ నాగార్జున. ఇంతకీ అఖిల్ పెళ్లాడబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలుసా...?

అక్కినేని అభిమానులకు షాకింగ్ న్యూస్. నాగచైతన్య పెళ్లితో పాటు అఖిల్ పెళ్లి కూడా జరగబోతోంది. అఖిల్ పెళ్ళి వార్తకు సంబంధించిన ప్రకటన చేశారు కింగ్ నాగార్జున. ముంబయ్ కు చెందిన నటితో అఖిల్ పెళ్ళి జరగబోతోంది. అంతే కాదు సీక్రేట్ గా నిశ్చితార్దం కూడా జరిగిపోయింది. అయితే ఎంగేజ్మెంట్ కు సబంధించిన ప్రకటన చేసిన నాగార్జున.. పెళ్లి చేసుకోబోతున్న జంట ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఇంతకీ అకిల్ చేసుకోబోయే ఆ ముంబయ్ హీరోయిన్ ఎవరు..? 

Also Read:  ధనుష్ రోలెక్స్ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా..? 2BHK ఇల్లే కొనొచ్చు

అతి త్వరలోనే అక్కినేని ఇంట్లో పెళ్లి బజాలు మోగనున్నాయి. అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కీలక విషయాన్ని నాగార్జున ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముంబై నటి జైనాబ్ రవ్దీజీని అఖిల్ అక్కినేని మంగళవారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తరువాత నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు. 

Also Read: అభిషేక్ తో నటించనని చెప్పిన ఐశ్వర్య రాయ్, డివోర్స్ పై క్లారిటీ ఇచ్చినట్టేనా..?


నాగార్జున ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు చాలా సంతోషంగా ఉంది.  దయచేసి యువ జంటను అభినందించడానికి మాతో పాటు చేయికలపండి.. వారు జీవితకాలం ప్రేమ, ఆనందం తో ఉండటానికి మీ లెక్కలేనన్ని ఆశీర్వాదాలు కావాలి. అంటూ అఖిల్ పెళ్లివార్త గురించి వెళ్ళడించారు. అంతే కాదు కొత్త జంట ఫోటోలను కూడా ఆయన శేర్ చేశారు. 

ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ లో నాగచైతన్య రెండో పెళ్ళి జరగబోతోంది. హీరోయిన్ శోభిత ధూళిపాళను ఆయన పెళ్ళాడబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్ధం అయిపోయింది. పెళ్ళిని చాలా సింపుల్ గా చాలా తక్కువ మంది అతిధుల సమక్షంలో జరపబోతున్నట్టు తెలుస్తోంది. ఇక నాగచైతన్య పెళ్ళి జరగడానికి ముందే ఇలా అఖిల్ నిశ్చితార్ధం సంబంధించిన న్యూస్  ప్రకటించడంతో అంతా షాక్ అవుతున్నారు. అక్కినేని ఫ్యాన్స్ కన్ ఫ్యూజ్ అవుతున్నారు. 
 

ರಶ್ಮಿಕಾ ಮಂದಣ್ಣ - ರಕ್ಷಿತ್ ಶೆಟ್ಟಿ

ఇక అఖిల్ పెళ్ళి కూడా గతంలో పీటలదాకా వచ్చి ఆగిపోయింది. వ్యాపార వెత్త కూతురు శ్రీయాభూపాల్ తో రెండుళ్లు ప్రేమలోపడిన అఖిల్... నిశ్చితార్ధం చేసుకుని పెళ్ళి వేడుకలకు ఇటలీవెళ్ళాలి అనుకున్నారు. అదే సమయానికి ఏం జరిగిందో  ఏమో కాని.. పెళ్లి కాన్సిల్ అయ్యింది. ఈ విషయం అప్పట్లో  సంచలనంగా మారింది. ఇక అప్పటి నుంచి కామ్ గా ఉన్న అఖిల్ ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. 

ఇప్పుడు చేసుకోబయే అమ్మాయి జైనాబ్ ముంబయ్ కు చెందిన నటిగా తెలుస్తోంది. అయితే ఆమెకు సబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. నాగచైతన్య నిశ్చితార్ధంతో పాటు.. ఇప్పుడు అఖిల్ నిశ్చితార్ధం కూడా అవ్వడంతో..పెళ్ళి కూడా త్వరలోనే ఉంటుందని సమాచారం. ఇక ఇద్దరు అక్కినేని హీరోలు పెళ్లి పీటలెక్కబోతున్నారని తెలిసి అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక అఖిల్ పెళ్లి డేట్ పై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

Latest Videos

click me!