హీరోయిన్ మీనా చేత కిస్సుతో కేక పెట్టించిన బాలకృష్ణ, షాక్ అయిన సూపర్ స్టార్ రజనీకాంత్

Published : Nov 06, 2022, 10:38 AM ISTUpdated : Nov 06, 2022, 11:16 AM IST

బాలయ్య మామూలోడు కాదు... అప్పట్లోనే  లిప్ లాక్ లతో కేకపుట్టించాడు. ఈ విషయం ఇన్నేకళ్ళ తరువాత ఈ విషయం బయటపెట్టాడు నటసింహం. ఇంతకీ బాలయ్య కెవ్వు కేకపుట్టించేలా కిస్ పెట్టిన సందర్భం ఏది..? ఎప్పుడు..?

PREV
16
హీరోయిన్  మీనా చేత కిస్సుతో కేక పెట్టించిన బాలకృష్ణ, షాక్ అయిన సూపర్ స్టార్  రజనీకాంత్

ఇప్పుడంటే.. హాట్ సీన్లు.. లిప్ లాక్ లు కామన్ అయిపోయాయి కాని.. అప్పట్లో హీరోయిన్ ను గట్టిగా హగ్ చేసుకుంటేనే అది చాలా పెద్ద మసాలాసీన్ గా ట్రీట్ చేసేవారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మాత్రమే కాస్త ఘాటు సీన్లు ఉండేవి. ఈక్రమంలో నటసింహం బాలయ్య చేసినచిలిపి పని గురించి రీసెంట్ గా ఓ సందర్భంలో వివరించారు. 
 

26

బాలయ్య యువరత్నగా ఉన్నప్పుడు వరుస సినిమాలతో నందమూరి అభిమానులను ఉర్రూతలూగించాడు. కాని ఎప్పుడూ రెచ్చిపోయి మసాలా సీన్లు చేయలేదు. అయితే ఓ సందర్భంలో మాత్రం హీరోయిన్ మీనాకు తప్పక లిప్ కిస్ ఇచ్చారట నటసింహం. 

36

రీసెంట్ గా  బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో.. గెస్ట్ లు గా అడివి శేష్.. శర్వానంద్ కలిసి పాల్గోన్నారు. ఈసందర్భంగా చర్చలోకి వచ్చింది ఈ కిస్సుల గోల. బాలయ్య బాబు అడివి శేష్ ను టార్గెట్ చేస్తూ.. కిస్సుల గురించి అడగ్గా.. సమాధానం ఇచ్చిన తరువాత.. ఆప్రశ్న నటసింహానికి రిటన్ లో అడిగారు యంగ్ హీరోలు. ఈ సందర్బంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు బాలకృష్ణ. 

46

బొబ్బిలి సింహం సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన ఓ సంఘటనను చెప్పారు బాలయ్య. ఈ మూవీ షూటింగ్  వేమూరు గ‌ట్టు మీద జ‌రుగుతోంద‌ట‌. ఓపెనింగ్ షాట్‌ను సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క్లాప్ కొట్టి స్టార్ట్ చేశారు. ర‌జ‌నీకాంత్ క్లాప్ కొట్ట‌గా బాల‌య్య సీరియ‌స్‌గా డైలాగ్ చెపుతున్నార‌ట‌. త‌ర్వాత హీరోయిన్ మీనా అవుట్ ఫీల్డ్ నుంచి వ‌చ్చి బాల‌య్య బుగ్గ మీద ముద్దు పెట్టేలా షాట్  ప్లాన్ చేశార‌ట ద‌ర్శ‌కుడు కోదండ రామిరెడ్డి . 

56

అయితే మీనా రావ‌డం ఆల‌స్యం కావ‌డంతో బాల‌య్య డైలాగ్ చెప్పి సీరియ‌స్‌గా ఇటు వైపు తిరిగాడ‌ట‌.వెంట‌నే మీనా అటు వైపు నుంచి ప‌రిగెత్తుకు వ‌చ్చింద‌ట‌. దీంతో బుగ్గమీద పెట్టాల్సిన ముద్దుకాస్తా.. లిప్స్ వరకూ వచ్చిందట.  ఇద్ద‌రి లిప్‌లు ద‌గ్గ‌ర‌కు రావడంతో.. మీనా కెవ్వుమ‌ని అరిచింద‌ట‌

66

ఇక ఈసినిమా ఓపెనింగ్ క్లాప్ కొట్టడానికి వచ్చిన రజనీ కాంత్ ప‌క్క‌నే ఉండటంతో.. ఈసీన్ చూసి ఆయన  షాక్ అయ్యార‌ట‌. అప్పట్లో అలా  జరిగిన ఆ ఫ‌న్నీ ఇన్సిడెంట్‌ను అన్ స్టాపబుల్ లో యంగ్ హీరోలతో కలిసి షేర్ చేసుకున్నారు  బాల‌య్య.
 

click me!

Recommended Stories