సమంతకి అద్భుతమైన క్రిస్టమస్ కానుక ఇచ్చిన దర్శకుడు.. సామ్ కి భలే నచ్చిందిగా, ఎమోషనల్

Published : Dec 25, 2022, 10:10 PM IST

నేడు క్రిస్టమస్ పండుగ సందర్భంగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతకి అద్భుతమైన కానుక పంపారు.

PREV
16
సమంతకి అద్భుతమైన క్రిస్టమస్ కానుక ఇచ్చిన దర్శకుడు.. సామ్ కి భలే నచ్చిందిగా, ఎమోషనల్

 వరుసగా అద్భుతమైన చిత్రాలతో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు సమంత యుఎస్ లో ట్రీట్మెంట్ తీసుకుంది. దీనితో సమంత చాలా కాలం అభిమానుల నుంచి, సినిమా షూటింగ్స్ నుంచి దూరంగా ఉంటోంది. 

26

నాగ చైతన్య నుంచి విడిపోవడం, ఇప్పుడు అనారోగ్యానికి గురికావడం ఇలా సమంత తన లైఫ్ లో టఫ్ ఫేజ్ ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం సామ్ మాయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునే పనిలో ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో సమంత సన్నిహితులు, స్నేహితులు ఆమెలో మనో ధైర్యం నింపుతున్నారు. 

36

అనారోగ్యంతో బాధపడుతూ కూడా సమంత యశోద ప్రమోషన్స్ లో పాల్గొంది.  సమంత ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె నటిస్తున్న 'ఖుషి' చిత్రం ఆగష్టులో వాయిదా పడింది. తనకు మరికొన్ని రోజుల పాటు టైం కావాలని సమంత ఖుషి నిర్మాతలని రిక్వస్ట్ చేసిందట. 

46

నేడు క్రిస్టమస్ పండుగ సందర్భంగా దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతకి అద్భుతమైన కానుక పంపారు. సమంత ధైర్యం, వ్యక్తిత్వం గురించి అద్భుతంగా రాసి ఉన్న ఫలకాన్ని ఆమెకి కానుకగా పంపాడు. ఈ గిఫ్ట్ చూసి సమంత కూడా సంతోషంగా ఫీల్ అయింది. రాహుల్ పంపిన గిఫ్ట్ ని సామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

56

'చీకటిగా ఉన్న సొరంగం.. కనుచూపు మేరలో వెలుతురు లేదు. కష్టంగా నడక సాగుతోంది. ఒక సైనికురాలిగా నువ్వు ముందుకు సాగుతున్నావు. నీవు ఉక్కు మహిళవి. అలాగే  సాగించు. తప్పకుండా వెలుగు వస్తుంది. సూర్యుడు మరింతగా  ప్రకాశిస్తాడు. నీలాంటి పోరాట యోధులు మాత్రమే విజయం సాధిస్తారు.   

66

నిన్ను ఓడించే శక్తి దేనికీ లేదు.. నువ్వు మరింత దృడంగా మారుతావు అంటూ రాహుల్ ఆ ఫలకం పై సమంత ప్రస్తుతం పరిస్థితి గురించి రాశారు. సమంత ఈ గిఫ్ట్ కి కామెంట్ పెడుతూ.. నాలాగా కష్టాలతో పోరాటం చేసే వారందరికి ఈ కానుక చెందుతుంది. పోరాటం కొనసాగిద్దాం.. మరింత దృఢంగా తయారవుదాం అని పేర్కొంది. 

click me!

Recommended Stories