కోపంలో బూతులు మాట్లాడతాడు... చెప్పుకుంటూ పోతే రేవంత్ బ్యాడ్ బిహేవియర్ గురించి ఒక రోజు సరిపోదు. కానీ హోస్ట్ నాగార్జున రావడంతోనే రేవంత్ ని ఎత్తే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఈ సీజన్లో నాగార్జున(Nagarjuna) హోస్టింగ్ వరస్ట్ అనాలి. ఆయన కొందరు కంటెస్టెంట్స్ ని ఉద్దేశపూర్వంగా టార్గెట్ చేశాడు అనిపిస్తుంది. బాల ఆదిత్య, ఆదిరెడ్డిపై సీజన్ స్టార్టింగ్ నుండి అక్కసు వెళ్లగక్కాడు. వాళ్ళ మిస్టేక్స్ బూతద్దంలో చూస్తాడు. లేనివి కూడా వెతుకుతాడు.