బిగ్ బాస్ గీతూ చేసిన పని తెలిస్తే చెప్పుతో కొడుతుంది... ఎలిమినేటైనా తీరు మారలేదు!

Published : Dec 02, 2022, 02:16 PM ISTUpdated : Dec 02, 2022, 02:32 PM IST

ఇప్పుడిప్పుడే గీతూ డిప్రెషన్ నుండి బైటపడుతుంది. ఆమె వరుసగా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె చేసిన చేసిన పని తెలిస్తే వాళ్ళ అమ్మ చెప్పుతో కొడుతుందట.   

PREV
17
బిగ్ బాస్ గీతూ చేసిన పని తెలిస్తే చెప్పుతో కొడుతుంది... ఎలిమినేటైనా తీరు మారలేదు!
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గీతూ ఓ సంచలనం. త్వరగా ఎలిమినేట్ అయినప్పటికీ గీతూ తన మార్క్ క్రియేట్ చేశారు. షోకి హైప్ తెచ్చిన ఘనత గీతూదే. ఆట పట్ల అవగాహన లేని కంటెస్టెంట్స్ లో నిప్పు రాజేసింది. మొదటి రెండు మూడు వారాలు గేమ్ మొత్తం గీతూదే. నాలుగో వారానికి గానీ మిగతా కంటెస్టెంట్స్ గేమ్ స్టార్ట్ చేశారు.

27
Bigg Boss Telugu 6

బిగ్ బాస్ టైటిల్ లక్ష్యంగా గీతూ బరిలో దిగారు. అందుకే ఫస్ట్ హౌర్ నుండి ఆమె గేమ్ ఆడారు. ఎక్కడా రిలాక్స్ కాలేదు. బిగ్ బాస్ రివ్యూవర్ గా తన అనుభవం మొత్తాన్ని వాడి అందరికంటే పైన ఉండాలి అనుకున్నారు. గీతూ ప్లాన్స్ ఒక దశ వరకు సక్సెస్ అయ్యాయి కూడా. 
 

37
Bigg Boss Telugu 6


ఈ క్రమంలో బిగ్ బాస్ ఆమెను పొగడటం స్టార్ట్ చేశాడు. హోస్ట్ నాగార్జున కూడా గీతూ గేమ్ ని మెచ్చుకున్నాడు. బిగ్ బాస్ ఆమె చుట్టూ గేమ్ ని నడిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇదంతా ఆమెలో ఓవర్ కాన్ఫిడెన్స్ కి కారణమయ్యాయి. దాంతో ట్రాక్ తప్పిన గీతూ గేమ్ నెగిటివిటీ మూటగట్టుకుంది. దాంతో గీతూ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యింది. 

47

9వ వారం ఎలిమినేట్ అయిన గీతూ బరస్ట్ అయ్యింది. ఓ రేంజ్ లో ఏడ్చింది. చిన్న పిల్ల మాదిరి హౌస్ నుండి వెళ్లనంటూ గోల చేసింది.ఎలిమినేట్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా క్వారంటైన్ రూమ్ కి వెళ్లిన గీతూ రెండు రోజులు అక్కడే ఉన్నారట. తన ఎలిమినేషన్ వీడియో చూస్తూ అన్నం, నీళ్లు మానేశారట . 
 

57
Bigg Boss Telugu 6

రోజులు గడిచే కొద్దీ గీతూ నార్మల్ లైఫ్ కి వస్తున్నారు. ఆమెకు ఎలిమినేషన్ బాధ ఉన్నప్పటికీ... తన పనిలో తాను నిమగ్నమయ్యారు. కాగా గీతూ హోస్ట్ నాగార్జునను మళ్ళీ కలిశారట. గీతూ ఇంకా బాధపడుతుందేమో అని భావించిన నాగార్జున ఆమెను కలిసి ధైర్యం చెప్పారట. ఈ విషయాన్ని గీతూ తాజా వీడియోలో వెల్లడించారు. 
 

67
Bigg Boss Telugu 6


అలాగే గీతూ తన కాలిపై చిరుత మచ్చల టాటూ వేయించుకున్నారు. రెండు గంటలు నొప్పి భరించి మరీ ఆ టాటూ వేయించుకున్నారట. ఆమెకు కాలిపై సైలెన్సర్ కాలిన గాయం ఆనవాళ్లు ఉన్నాయట. అవి కనపడకుండా టాటూతో కవర్ చేసినట్లు చెప్పింది. అయితే తాను టాటూ వేయించుకున్న విషయం వాళ్ళ అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుందట. 
 

77
Bigg Boss Telugu 6

ఫ్యామిలీ వీక్ చూసి గీతూ చాలా బాధపడ్డారట. ఫైనల్ కి వెళ్లకపోయినా కనీసం ఫ్యామిలీ వీక్ వరకూ ఉంటే మా అమ్మను హౌస్లోకి తీసుకొచ్చే దాన్ని. ఆ సందర్భం కోసం కొత్త చీర కూడా కొని ఉంచానని గీతూ ఎమోషనల్ అయ్యారు. ఇక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వరుస వీడియోలు చేస్తున్న గీతూ... మంచి వ్యూస్ రాబడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories