21 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ గా ప్రారంభమైంది. గత రెండు సీజన్స్ తో పోల్చుకుంటే ఈసారి హౌస్లోకి తెలిసిన ముఖాలు వెళ్లారు. సింగర్ రేవంత్, అభినయశ్రీ, చలాకీ చంటి, బాల ఆదిత్య, ఫైమా, కీర్తి, సుదీప లాంటి సెలెబ్రిటీలు షోలో భాగమయ్యారు. మరి ఈ కంటెస్టెంట్స్ రెమ్యూనరేషన్స్ ఎంత? ఎవరు హైయెస్ట్? ఎవరు లోయస్ట్ అనే విషయం తెలుసుకోవాలని ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సీజన్ కి గాను అత్యధికంగా ఓ కంటెస్టెంట్ రోజుకు రూ. 60 వేలు తీసుకుంటుండగా అత్యల్పంగా మరో కంటెస్టెంట్ కేవలం రూ. 15 వేలు తీసుకుంటున్నారట.