శ్రీసత్య ఎలిమినేట్ కావడంతో ఇనయా, కీర్తి నెక్స్ట్ రౌండ్ లో పోటీపడ్డారు. గెలుపు కోసం ఇనయా, కీర్తి హోరాహోరీగా పోటీపడ్డారు. ఒకరి వీపుపై మరొకరు రెడ్ కలర్ రాసేందుకు శాయశక్తులా కృషి చేశారు. కిందా మీదా పడుతూ ఆల్మోస్ట్ కొట్టుకున్నంత పని చేశారు. బజర్ మోగగానే గేమ్ ఆపేశారు. సంచాలక్ గా ఉన్న రేవంత్ విన్నర్ ని నిర్ణయించడం చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఇద్దరి టీషర్ట్స్ పై ఎక్కువగానే రంగు ఉంది అన్నారు. ఫైనల్ గా కీర్తి గెలిచినట్లు ప్రకటించాడు. దీంతో ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్, కీర్తి, ఫైమా, శ్రీహాన్.. టికెట్ టు ఫినాలే కోసం పోటీపడ్డారు.