ఆ డైరెక్టర్ లక్ష ఇస్తా వస్తావా అన్నాడు, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి...  బిగ్ బాస్ శ్వేత వర్మ సంచలన కామెంట్స్

Published : Oct 29, 2021, 01:08 PM IST

Bigg boss telugu 5 కంటెస్టెంట్స్ లో నటి శ్వేత వర్మ ఒకరు. 19మందిలో ఒకరిగా హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా సత్తా చాటారు. అగ్రెస్సివ్ నేచర్ తో తన మార్కు గేమ్ చూపించిన శ్వేత అనూహ్యంగా ఎలిమినేట్ కావడం జరిగింది. 

PREV
17
ఆ డైరెక్టర్ లక్ష ఇస్తా వస్తావా అన్నాడు, స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి...  బిగ్ బాస్ శ్వేత వర్మ సంచలన కామెంట్స్


టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటుంది అనుకుంటే... ఐదు వారాలకే చాప చుట్టేసింది. అయినప్పటికీ ఈ షో ద్వారా శ్వేతా వర్మ కొంత ఫేమ్ రాబట్టారు. తన అభిమానులను పెంచుకున్నారు. పలు సినిమాలు, సిరీస్ లలో నటించినా రాని గుర్తింపు, Bigg boss షోతో దక్కింది. దీంతో ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 
 

27

తాజాగా శ్వేత ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అలాగే యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఆమె కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో Swetha varmaku కు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

37

2013లో నేను షార్ట్ ఫిలిమ్స్ తో నటిస్తున్నాను. పేస్ బుక్ లో ఒక డైరెక్టర్ ఛాట్ చేశారు. ఆ కన్వర్సేషన్ లో అతడు కమిట్మెంట్ ఇవ్వాలి అన్నాడు.. కమిట్మెంట్ అంటే నాకు అప్పుడు తెలియదు, హార్డ్ వర్క్ చేయాలని, అడుగుతున్నాడని అనుకున్నాను. తర్వాత అతను లక్ష రూపాయలు ఇస్తాను... వస్తావా అని అడిగారు.

47

ఆ ఛాట్ స్క్రీన్ షాట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు నాకు విపరీతమైన కోపం వచ్చింది. నా కోసం కూడా ఒకటి చేస్తారా.. అని అడిగాను. ఏమిటని అతను అనగానే, పెద్ద బిల్డింగ్ పై నుండి దూకేయండి, అని సమాధానం చెప్పాను. 


 

57

అయితే మహిళలు బహిరంగంగా వేధింపులపై మాట్లాడడం, మీటూ ఉద్యమం వలన లైంగిక వేధింపులు తగ్గాయి. ఒకప్పుడు 99 శాతం ఉండేవి అవి 30 శాతానికి చేరాయి. కానీ ఇప్పటికీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. 

67

అయితే నాకు ఆన్లైన్ తో తప్పితే నేరుగా ఇలాంటి సమస్య ఎదురుకాలేదు. దానికి కారణం కొత్తవారితో పని చేయడం, అది కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వారు కావడం సినిమాలు, యాడ్స్ వంటి గ్లామర్ ఫీల్డ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. అంటూ శ్వేతా వర్మ ఓపెన్ గా తన అభిప్రాయం వ్యక్త పరిచారు.

77

శ్వేత వర్మ గ్యాంగ్ ఆఫ్ గబ్బర్ సింగ్ మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే పనిలేని పులిరాజు, వశం, మిఠాయి, సైకిల్ వంటి చిత్రాలలో ఆమె నటించడం జరిగింది. ఆమెకు బిగ్ బాస్ తరువాత పలు ఆఫర్స్ దక్కుతున్నాయని సమాచారం. 

 

Also read కేటీఆర్ సార్! మీరు గైడ్ చేస్తారని ఆశిస్తున్నా.. వైరల్ అవుతున్న యాంకర్ అనసూయ ట్వీట్..

Also read Romantic: రొమాంటిక్ సెలబ్రిటీ రివ్యూ... దూల తీరిపోతుంది, కుర్రాళ్ళు ఫస్ట్ షో టికెట్స్ బుక్ చేసుకోండి!

click me!

Recommended Stories