పందులే గుంపులుగా ఆడతాయి.. సింహం సింగిల్‌గానే ఆడుతుందంటూ అనీ మాస్టర్‌ ఫైర్‌.. కొత్త కెప్టెన్‌ షణ్ముఖ్‌

First Published | Oct 28, 2021, 11:50 PM IST

కెప్టెన్సీ టాస్క్ కోసం షణ్ముఖ్‌, సిరి, సన్నీ, అనీ మాస్టర్, శ్రీరామ్‌, మానస్‌ పోటీ పట్టారు. ఈ పోటీలు ప్రతి పోటీదారు థర్మకోల్‌ ఫిల్‌ చేసిన బస్తా సంచులను వెనకాల తగిలించుకోవాల్సి ఉంటుంది. 

బిగ్‌బాస్‌ 5.. 54వ ఎపిసోడ్‌(గురువారం) ఆద్యంతం మరింత రక్తికట్టించింది.  కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్‌బాస్‌ `వెంటాడు వేటాడు` టాస్క్ ఇచ్చాడు. ఇందులో కెప్టెన్సీ టాస్క్ కోసం షణ్ముఖ్‌, సిరి, సన్నీ, అనీ మాస్టర్, శ్రీరామ్‌, మానస్‌ పోటీ పట్టారు. ఈ పోటీలు ప్రతి పోటీదారు థర్మకోల్‌ ఫిల్‌ చేసిన బస్తా సంచులను వెనకాల తగిలించుకోవాల్సి ఉంటుంది. చివరి వరకు ఎవరి వద్ద ఎక్కువ థర్మకోల్‌ ఉంటుంది, ఎవరు ఆపకుండా రింగ్‌లో తిరుగుతారో వారే విన్నర్‌గా నిలుస్తారు. ఈ పోటీ ఆద్యంతం  రంజుగా, ఆసక్తికరంగా, రక్తికట్టించేలా సాగింది. 
 

గురువారం ఎపిసోడ్‌ ప్రారంభంలో నైట్‌ మానస్‌ వద్ద ఏదో గుండ్రటి ఐటెమ్‌ తెచ్చి, షణ్ముఖ్‌, సిరిలపై వేశాడు. సరదాగా కాసేపు నవ్వులు పూయించుకున్నారు. ఆటపట్టించుకున్నారు. ఆ తర్వాత జెస్సీ మ్యాటర్‌ తీసుకొచ్చాడు కెప్టెన్‌ సన్సీ. ఆనీ మాస్టర్‌ కోసం డ్రాప్‌ అవుతున్నానని ముందు చెప్పాలని, ముందు ఒక మాట, తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారని జెస్సీపై మానస్‌ వద్ద అసహనం వ్యక్తం చేశాడు సన్నీ. అంతేకాదు ఈ సందర్భంగా ఓ షాకింగ్‌ కామెంట్‌ చేశారు. గేమ్‌లు ఆడటం కాదు, ఓటింగ్‌నే ప్రధానంగా తీసుకుంటున్నారు. అందుకే గేమలను సీరియస్‌గా తీసుకోవడం లేదన్నాడు సన్నీ. 
 


ఆ తర్వాత షణ్ముఖ్‌, సిరిల మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. `మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం` అని అనగానే సిరి..`నేను బాగానే ఉన్నా రా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా` అని అంటుంది. వెంటనే `అయితే దూరం పెట్టుకో..` అని షణ్ను అంటాడు.  `అరె.. ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్‌` అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు ముద్దుపెట్టి వెళుతుంది. ఆ తర్వాత షణ్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ `అరె ఎంట్రా ఇది` అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడతాడు. అలాగే `అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది` అంటూ ఫన్నీగా అంటాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఓ రొమాంటిక్‌ లవ్‌ సాంగ్‌ వేయడం వీరిద్దరి మధ్య లవ్‌ స్టోరీకి తెరలేపినట్టయ్యింది. 

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా  కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, సన్నీ, మానస్‌లు పోటీలో విజయం సాధించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు బిగ్‌బాస్‌ `వెంటాడు వేటాడు` అనే టాస్క్‌ ఇచ్చాడు. థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్‌.. బజర్‌ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్‌ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్‌ అవుతారని సూచించాడు. 
 

టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరిగింది. సంచాలకుడిగా ఉన్న జెస్సీ మొదటి సారి ఆటని రద్దు చేసిన మరోసారి చేయించాడు. ఆ తర్వాత సన్నీ, శ్రీరామ్‌ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇందులో సన్నీ వైదొలిగాడు. 
 

ఆ తర్వాత జరిగిన గొడవలో మానస్‌, శ్రీరామ్‌కి గొడవ జరిగింది. ఇద్దరు కింద పడ్డారు. అందులో ఇద్దరిని ఎలిమినేట్‌ చేశాడు జెస్సీ. కానీ మానస్‌ కొనసాగాలని సన్నీ పట్టుపట్టాడు. ఈ విషయంలో జెస్సీతో, శ్రీరామ్‌తో మరోసారి గొడవ అయ్యింది. సన్నీ సైతం బాగా రెచ్చిపోయాడు. ఎట్టకేలకు మానస్‌ వైదొలిగాడు. చివరగా అనీ మాస్టర్‌, షణ్ముఖ్‌, సిరి పోటీ పడ్డారు. ఇందులో సిరి, షణ్ముఖ్‌ కలిసి ఆడుతున్నారని, ఒకరికొరు సపోర్ట్ చేస్తున్నారని వాపోయింది అనీ మాస్టర్‌. ఒంటరిగా గేమ్‌ ఆడటం లేదని వాపోతూ ఆమె మధ్యలోనే క్విట్‌ అయ్యింది. ఈ సందర్భంగా షణ్ముఖ్‌పై గట్టిగా ఫైర్‌ అయ్యింది. మగాడు అయితే గేమ్‌ ఆడాలని అన్నది. అంతేకాదు పందులు గుంపులుగా ఆడతాయని, సింహం ఒంటరిగానే ఆడుతుందని చెప్పింది. ఈ విషయంలో అనీ మాస్టర్‌ని సముదాయించే ప్రయత్నం చేశారు రవి, విశ్వ, ప్రియాంక. 

అనీమాస్టర్‌పై సన్నీ కూడా ఫైర్‌ అయ్యాడు. తాము గుంపులుగా ఆడతామని, ఇకపై తమ ఆటేంటో చూపిస్తామన్నారు. దీనిపై ఆ తర్వాత మానస్‌, సన్నీల మధ్య డిస్కషన్‌ జరిగింది. ఎవరెవరిని టార్గెట్‌ చేయాలో నాకు తెలుసు. ఇకపై ఎటాక్ ఏంటో చూపిస్తానని సవాల్‌ విసిరాడు. ఆ తర్వాత సన్నీ సైతం గేమ్‌ మార్చాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇకపై గుంపులుగానే గేమ్‌ ఆడదామని చెప్పాడు. అయితే ఫైనల్‌గా షణ్ముఖ్‌, సిరిల మధ్య గేమ్‌ జరగ్గా సిరి ఓడిపోయి షణ్ముఖ్‌ కెప్టెన్‌ అయ్యాడు. కెప్టెన్‌ అయ్యారు మరోసారి సిరి హగ్‌ చేసుకుంది. అదే సమయంలో అనీ మాస్టర్‌తో ఇష్యూని క్లీయర్‌ చేసుకున్నాడు షణ్ముఖ్‌. మరోవైపు సన్నీ, మానస్‌లతోనూ సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించారు. కానీ సన్నీ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో తర్వాత కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడు కెప్టెన్‌ షణ్ముఖ్‌. 

also read: జాన్వీ కపూర్‌ ఇంతగా రెచ్చిపోతే తట్టుకోవడం కష్టమంటోన్న కుర్రాళ్లు.. అందాల సమ్మోహనం ఇలానే ఉంటుందేమో!

also read: జగన్‌ని చూసి చాలా రోజులైంది.. అందుకే వచ్చా : హీరో నాగార్జున .. చర్చలపై సస్పెన్స్

Latest Videos

click me!