బిగ్ బాస్ షోలో సండే రోజు ఎలిమినేషన్ జరిగింది. వర్షిణి హౌస్ నుంచి బయటకు వెళ్ళింది. అదే విధంగా నాగ చైతన్య నటిస్తున్న క్రేజీ మూవీ వృషకర్మ టీమ్ బిగ్ బాస్ స్టేజీపై మెరిశారు. నాగ చైతన్యతో పాటు మీనాక్షి చౌదరి, దర్శకుడు కార్తీక్ దండు, విలన్ స్పర్శ్ శ్రీవాస్తవ, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ బిగ్ బాస్ షోలో మెరిశారు. నిర్మాత ప్రసాద్ గురించి నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలకి చేశారు. మగధీర, అత్తారింటికి దారేది లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఆయనకు మాత్రమే సాధ్యం అయ్యాయి అని అన్నారు.