Bigg Boss 10 Double Elimination: ఎలిమినేషన్‌లో ట్విస్ట్, రోహిత్‌ ఔట్‌.. బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌

Published : Oct 31, 2026, 08:22 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి ఎనిమిదో వారం ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటిది జరిగింది. రోహిత్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. కానీ..

PREV
13
బిగ్‌ బాస్‌ తెలుగు 10 8వ వారం మొదటి ఎలిమినేషన్‌ సింగర్ ఝాన్సీ

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ 8వ వారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎలిమినేషన్‌ ప్రక్రియ ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతుంది. శుక్రవారం సుధీర్‌ని ఎలిమినేట్‌ చేశారు. కానీ స్పెషల్‌ పవర్‌తో సేవ్‌ చేశారు. ఇప్పుడు వీకెండ్‌లో డబుల్‌ ఎలిమినేషన్‌ ఉందట. ఇప్పటికే సింగర్‌ ఝాన్సీ ఎలిమినేట్‌ అయినట్టు సమాచారం. ఆమెకి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ వారం మొదటి ఎలిమినేషన్‌లో భాగంగా ఝాన్సీని ఎలిమినేట్‌ చేశారట. అయితే మరో ఎలిమినేషన్‌ ఉందని తెలుస్తోంది.

23
రోహిత్‌ ఎలిమినేట్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 8వ వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉందని సమాచారం. అయితే మొదట స్వేతా నాయుడు ఎలిమినేట్‌ కాబోతుందని ప్రచారం జరిగింది. ఆమె సేవ్‌ అయ్యారు. కానీ మరో కంటెస్టెంట్‌ని ఎలిమినేట్‌ చేశారు. నాగార్జున హౌజ్‌ మేట్స్ ఓటింగ్‌తో మరో కంటెస్టెంట్‌ని ఎలిమినేట్‌ చేశారట. హౌజ్‌లో కొనసాగడానికి ఎవరు అనర్హులు అనే టాస్క్ ఇవ్వగా, కంటెస్టెంట్లు మెయిన్‌గా రోహిత్‌ని అనర్హుడిగా ప్రకటించారు. ఆయనకే ఎక్కువగా ఓట్లు వేశారట. ఈ నేపథ్యంలో రోహిత్‌ ని డబుల్‌ ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం.

33
బిగ్‌ బాస్‌ చరిత్రలో మొదటి సారి

కానీ బిగ్‌ బాస్‌ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటిది చోటు చేసుకుందట. ఈ వారం సెకండ్‌ ఎలిమినేట్‌ అయిన రోహిత్‌ని సీక్రెట్‌ రూమ్‌కి పంపించారట. ఆయన్ని ఎలిమినేట్‌ చేసి, చివర్లో ట్విస్ట్ ఇస్తూ సీక్రెట్‌ రూమ్‌కి పంపించారని సమాచారం. బిగ్‌ బాస్ తెలుగు తొమ్మిది సీజన్లలోనూ ఇది జరగలేదు. ఒక్క సీజన్‌లో ఒక్కరిని మాత్రమే సీక్రెట్‌కి పంపించేవారు. ఈ సీజన్‌లో షాలినిని ఇప్పటికే సీక్రెట్‌ రూమ్‌కి పంపించారు. ఆ తర్వాత మళ్లీ హౌజ్‌లోకి పంపించారు. ఆమె ఆటలో, యాటిట్యూడ్‌లో మార్పు రాలేదు. దీంతో అదే వారం ఎలిమినేట్‌ చేశారు. ఇప్పుడు ఈ వారం కూడా సింగర్‌ ఝాన్సీతోపాటు రోహిత్‌ని ఎలిమినేట్‌ చేశారు. కాకపోతే అతన్ని ఇంటికి పంపించకుండా సీక్రెట్‌ రూమ్‌కి పంపించారట. మరో ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇలా ఒకే సీజన్‌లో ఇద్దరు కంటెస్టెంట్లని సీక్రెట్‌ రూమ్‌కి పంపించడం ఇదే మొదటిసారి. అంతేకాదు బ్యాక్‌ టూ బ్యాక్‌ డబుల్‌ ఎలిమినేషన్‌ చేయడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. మరి రోహిత్‌ తానేంటో నిరూపించుకుంటాడా? షాలిని లాగే వెళ్లిపోతాడా అనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories