Trivikram: రూమర్స్ కి చెక్ పెట్టేసిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో 'గాడ్ ఆఫ్ వార్' లేటెస్ట్ అప్డేట్ ఇదే

Published : Nov 13, 2026, 04:16 PM IST

ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ సినిమా ఆగిపోయిందని, నాగవంశీతో త్రివిక్రమ్‌కు విభేదాలు మొదలయ్యాలి అనే ప్రచారం జరిగింది. దీనితో త్రివిక్రమ్ హారిక అండ్ హాసిని, సితార సంస్థల నుంచి తప్పుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

PREV
14
నాగవంశీ త్రివిక్రమ్ మధ్య విభేదాలంటూ ప్రచారం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నిర్మాత నాగవంశీ, దర్శకుడు త్రివిక్రమ్ మధ్య విభేదాలు వచ్చాయని, దీంతో త్రివిక్రమ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి బయటకు వెళ్లిపోయారని పుకార్లు వినిపించాయి. అంతేకాదు, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో రూపొందాల్సిన ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా కూడా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ఈ వార్తలతో సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి.వెంకటేష్ తో తెరకెక్కించిన ఆదర్శ కుటుంబం మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీనితో త్రివిక్రమ్ కి, హారిక అండ్ హాసిని సంస్థకు మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ ప్రచారం సాగింది.

24
ఒకే ఫొటోతో పుకార్లకు చెక్ పెట్టిన నాగవంశీ

ఈ ప్రచారంపై నిర్మాత నాగవంశీ తనదైన శైలిలో స్పందించారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్, కల్యాణ్ రామ్, చినబాబు కలిసి ఉన్న ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఒక్క ఫొటోతో నాగవంశీ, త్రివిక్రమ్ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు తెరపడింది. అంతేకాదు, ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి కూడా ఈ పోస్టుతో సమాధానం ఇచ్చినట్లయింది. ఈ ఫొటో ద్వారా చిత్ర బృందం మధ్య అంతా సవ్యంగానే ఉందనే సంకేతం ఇచ్చారు. దీంతో సినిమా గురించి వస్తున్న పుకార్లకు ముగింపు లభించినట్లయింది.

34
సుబ్రహ్మణ్యస్వామి నేపథ్యంలో గాడ్ ఆఫ్ వార్

‘గాడ్ ఆఫ్ వార్’ ఒక భారీ పౌరాణిక గాథగా రూపొందనుంది. సుబ్రహ్మణ్యస్వామి స్వామి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ నటించనున్న ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పౌరాణిక అంశాలతో రూపొందనున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇతర నటీనటుల సమాచారం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

44
హారిక అండ్ హాసిని, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణం

‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ ప్రాజెక్టుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగవంశీ పోస్ట్ చేసిన ఫొటోతో సినిమా ఆగిపోయిందనే ప్రచారానికి తెరపడటంతో పాటు, నాగవంశీ, త్రివిక్రమ్ మధ్య అంతా బాగానే ఉందనే విషయం స్పష్టమైంది.

Read more Photos on
click me!

Recommended Stories