Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ లో మరోసారి రఫ్ఫాడించిన ఇమ్మాన్యుయేల్.. గెస్ట్ గా వచ్చిన దివ్యతో ముకేశ్ రచ్చ

Published : Nov 25, 2026, 09:33 AM IST

బిగ్ బాస్ హౌస్ లో 79వ రోజు ఉత్కంఠ రేకెత్తించే టాస్క్ లతో పాటు మంచి ఫన్ కూడా ఆకట్టుకుంది. హౌస్ లోకి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
13
Bigg Boss Telugu 10

బిగ్ బాస్ హౌస్ లోకి 79వ రోజు మాజీ కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయేల్, సంజన, కళ్యాణ్, దివ్య గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. గెస్ట్ లుగా అడుగుపెట్టినప్పటికీ వాళ్ళు హౌస్ లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముందుగా హౌస్ లోకి ఇమ్మాన్యుయేల్, సంజన ఎంట్రీ ఇచ్చారు. కాసేపు అందరితో ఇమ్మాన్యుయేల్ సరదాగా మాట్లాడారు. హౌస్ నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ సుధీర్ చాలా సార్లు గుడ్ బై చెప్పాడు. కానీ అతడి పక్కన ఉన్నవాళ్లు వెళ్లిపోతున్నారు కానీ అతడు వెళ్లడం లేదు అంటూ ఇమ్మాన్యుయేల్ ఫన్నీ కామెంట్స్ చేశాడు.

23
ఆర్కేని గెలిపించిన ఇమ్మాన్యుయేల్

కెప్టెన్సీ కంటెండర్ పోటీలో పాల్గొనేందుకు అర్హత సాధించిన వారిలోనుంచి ఒక్కరిని ఇమ్మాన్యుయేల్, సంజన తమ పెయిర్ గా ఎంచుకోవాలి అని బిగ్ బాస్ తెలిపారు. దీనితో ఇమ్మాన్యుయేల్ ఆర్కేని.. సంజన త్రిగుణ్ ని తమ పెయిర్ గా ఎంచుకున్నారు. ఈ రెండు టీమ్స్ మధ్య పాము టైల్ నుంచి హెడ్ వరకు అమర్చే టాస్క్ జరిగింది. చివరగా హెడ్ అమర్చే సమయంలో రెండు టీమ్స్ మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. గొడవలు కూడా జరిగాయి. కానీ చివరికి ఇమ్మాన్యుయేల్, ఆర్కే టీం విజయం సాధించింది.

33
దివ్యతో ముకేశ్ గొడవ

ఆ తర్వాత హౌస్ లోకి కళ్యాణ్, దివ్య ఎంట్రీ ఇచ్చారు. శివకుమార్ ని కళ్యాణ్.. రామ్ ప్రసాద్ ని దివ్య తమ పెయిర్ గా ఎంచుకుని గేమ్ ఆడారు. ఒకరు ఫోటోలు పగలగొడుతుంటే మరొకరు వేరే టీం వ్యక్తి అడ్డుకోవాలి. ఈ గేమ్ కి ముకేశ్ సంచాలకుడు. ఎవరు ఎక్కువ ఫోటోలు పగలగొడితే వాళ్లే విజేతలు. గేమ్ మధ్యలో ముకేశ్, దివ్య మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది కానీ చివరికి కళ్యాణ్, శివకుమార్ టీం విజయం సాధించింది.

Read more Photos on
click me!

Recommended Stories