Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే

Published : Sep 02, 2026, 05:18 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు కూడా ఫైనల్‌ అయ్యారట. ఈ సారి 16 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10 చాలా ప్రత్యేకం

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కాబోతుంది. వచ్చే ఆదివారం సాయంత్రం స్టార్ట్ కానుంది. దీనికి సంబంధించిన గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే షూటింగ్‌ కూడా స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. గత సీజన్ల కంటే ఈ సీజన్‌ని చాలా ప్రత్యేకంగా మార్చబోతున్నారట. హౌజ్‌ నుంచి, కంటెస్టెంట్ల ఎంపిక, వచ్చే కంటెస్టెంట్లు, గేమ్స్, టాస్క్ లు ఇలా అన్ని కొత్తగా ఉండబోతున్నాయని, ఎంటర్‌టైన్‌మెంట్ 10 టైమ్స్ అనేలా ప్లాన్‌ చేస్తున్నట్టు నాగార్జున ప్రోమోల్లో చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షో పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

25
16 మంది కంటస్టెంట్లతో బిగ్‌ బాస్‌ తెలుగు 10 షురూ

ఈ సారి చాలా వరకు తెలిసిన కంటెస్టెంట్లని ఎంపిక చేశారట. సెలబ్రిటీ విభాగంలో చాలా వరకు తెలిసిన వాళ్లే వస్తున్నారని సమాచారం. గతంలో సగం తెలియని వారు ఉండేది. ఇన్‌ఫ్లూయెన్సర్లు, సినిమా, టీవీకి సంబంధం లేని వారు, ఇతర రంగాలకు చెందిన వాళ్లు ఉండేవారు. కానీ ఈ సారి చాలా వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి పరిచయం ఉన్నవాళ్లే వస్తున్నారట. అందులో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు ఆల్‌మోస్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి సెలబ్రిటీలు, కామనర్స్ కలిపి దాదాపు 16 మంది కంటెస్టెంట్లు రాబోతున్నారట. వీరిలో పది మంది సెలబ్రిటీలు, 6 కామనర్స్ ఉంటారని సమాచారం.

35
సెలబ్రిటీ కంటెస్టెంట్లు వీరే

వీరిలో సెలబ్రిటీ విభాగంలో టెంపర్‌ వంశీ, రామ్‌ ప్రసాద్‌, జబర్దస్త్ నరేష్‌, అదిత్‌(త్రిగుణ్‌), యాంకర్‌ వర్షిణి సౌందరాజన్‌, ముఖేష్‌ గౌడ, కృష్ణుడు, నటి చైత్ర రాయ్‌, సుధీర్‌ రెడ్డి, దేబ్జానీ వంటి సెలబ్రిటీ కంటెస్టెంట్లు బిగ్‌ బాస్‌ హౌజ్‌కి ఎంపిక చేశారట. ప్రస్తుతం వీరి పేర్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇదే నిజమే అయితే హౌజ్‌ ఈ సారి యమ రంజుగా ఉండబోతుందని చెప్పొచ్చు. గ్లామర్‌కి గ్లామర్‌, కామెడీకి కామెడీ, ఫైట్లకి ఫైట్లు గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు.

45
హౌజ్‌లోకి రాబోతున్న కామనర్స్ వీళ్లే

ఇక కామనర్స్ విభాగంలో సింగర్‌ ఝాన్సీ, రోహిత్‌, షాలిని, సృష్టి వ్యాకరణం, నవరసాలు ఆర్కే, ఆర్జే చరణ్‌ కంటెస్టెంట్లుగా ఎంపికైనట్టు సమాచారం. కామనర్స్ విభాగంలో ఆరుగురు కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పంపే అవకాశం ఉందట. మొత్తంగా ఈ సారి 16 మందితో షో స్టార్ట్ అవుతుందని సమాచారం. కామనర్స్ లోనూ చాలా వరకు స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లు ఉన్నారు. టాస్క్ ల్లో, గేమ్స్ లో సెలబ్రిటీలకు గట్టిపోటీ ఇచ్చేలా ఉన్నారు. అదే సమయంలో వాదించే విషయంలో తగ్గేదెలే అనేలా ఉన్నారు. ఇది షోకి హెల్ప్ అవుతుందని, ఈ సారి బిగ్‌ బాస్‌ హౌజ్‌ వేరే లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తోంది.

55
నాగార్జున హోస్ట్ గా బిగ్‌ బాస్‌ తెలుగు 10 స్టార్ట్

నాగార్జున హోస్ట్ గా `బిగ్‌ బాస్‌ తెలుగు 10` రన్‌ కాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడేళ్లుగా ఆయన హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ప్రారంభంలో ఎన్టీఆర్‌, నాని చేశారు. మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ఈ పదవ సీజన్‌ వరకు ఉంటారని సమాచారం. అయితే గతంలో నాగ్‌ హోస్టింగ్‌ విషయంలోనూ కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన కూడా ఈ సారి స్ట్రిక్ట్ గా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సీజన్‌ని పెద్ద హిట్‌ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారట. మరి ఎంత వరకు సక్సెస్‌ అవుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories