Bigg Boss Telugu 10: బిగ్ బాస్ కోసం కోటి డిమాండ్ చేస్తున్న స్టార్ ఎవరో తెలుసా? ఈసారి రచ్చ రచ్చే..

Published : Apr 26, 2026, 08:58 AM IST

బిగ్ బాస్ తెలుగు రియాల్టీషో.. ప్రతీ సీజన్ అంతకు మించి అన్నట్టుగా మారిపోయింది. ప్రతీ ఏడాది మార్పులు చేర్పులతో అదగొడుతున్నారు టీమ్.  సీజన్ 9 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. ఇక బిగ్ బాస్ 10 ను మరింత ఉత్కంఠబరితంగా మార్చేందకు ప్రయత్నిస్తున్నారు.

PREV
15
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10

బిగ్ బాస్ తెలుగు రియాల్టీషో 10వ ఏడాదిలోకి అడుగు పెట్టబోతోంది. 10 సీజన్ ను సక్సెస్ చేయడానికి టీమ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫుల్ జోష్ మీద ఉన్నారు బిగ్ బాస్ టీమ్. గతంలో జరిగిన పొరపాట్లు రిపిట్ అవ్వకుండా.. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. 2017 లో స్టార్ట్ అయిన ఈ షో.. ఎంతో మంది స్టార్స్ కు లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలను వెండితెర స్టార్స్ గా మార్చింది.

25
అడ్డంకులు దాటుకుంటూ..

బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది. ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్టింగ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఆతరువాత సెకండ్ సీజన్ ఉత్కంఠగా నడిచినా.. హోస్ట్ గా నాని ఫెయిల్ అయ్యారన్న విమర్షలు తప్పలేదు. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున ఈ షోను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు.

మధ్యలో ఒకటీ రెండు సీజన్లు యావరేజ్ అనిపించినా.. ఆతరువాత బిగ్ బాస్ టీమ్ అలర్ట్ అవ్వడంతో, మళ్లీ ఈ రియాల్టీషో ట్రాక్ లోకి వచ్చింది. ఒక వైపు ఈ షోను బ్యాన్ చేయాలని పోరాటాలు జరుగుతుండగా, సోషల్ మీడియాలో కూడా బిగ్ బాస్ పై ఎప్పటికప్పుడు దాడి పెరిగిపోతోంది. అయినా సరే వాటిని తట్టుకుని కొనసాగుతోంది.

35
బిగ్ బాస్ 10 కోసం భారీగా ఏర్పాట్లు..

ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 భారీగా ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఎక్కడా పొరపాట్లు జరగకుండా.. ఆడియన్స్ కు అద్భుతమైన కంటెంట్ తో పాటు, మంచి ఎంటర్టైన్మెంట్, గ్లామర్, ను కూడా యాడ్ చేసే విధంగా షోను ప్లాన్ చేశారట. అందుకోసమే ఈసారి కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టి స్టార్స్ ను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. కొంత మంది కాంట్రవర్సీ స్టార్స్ ను కూడా రంగంలోకి దించే ఆలోచలో ఉన్నారట టీమ్. అందులో భాగంగా.. ప్రస్తుతం వివాదంలో చిక్కకున్న ఫోక్ సింగర్ మంగ్లీని కూడా వీరు సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఆమె ఓ కేసులో ఉండటంతో.. హౌస్ లోకి వచ్చే అవకాశాలు తక్కువే అని తెలుస్తోంది.

45
బిగ్ బాస్ కోసం భారీ రెమ్యునరేషన్..

గత సీజన్లలో బుల్లితెర తారలదే హవా నడించింది. ఈసారి కూడా పాపులర్ టీవీ ఆర్టిస్ట్ లను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తంది. గతంలో స్టార్ కంటెస్టెంట్స్ గా ఉన్న అమర్ దీప్ భార్య.. బుల్లితెర స్టార్ తేజస్వీని గౌడ, ఈసీజన్ లో కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈమెతో పాటు మరో పాపులర్ టీవీ హీరోయిన్.. సీజన్ 8 విన్నర్ నిఖిల్ లవర్ కావ్యశ్రీ కూడా ఈసారి బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్టు సమాచారం. కానీ వీరిద్దరు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సీరియల్స్ వదులుకొని రావాలి కాబట్టి.. వారానికి 6 లక్షల పైనే వీరు అడుగుతున్నారట.

55
రసవత్తరంగా బిగ్ బాస్ సీజన్ 10

బుల్లితెరపై డిమాండ్ ఉన్న నటీమణులు కావడంతో.. వీరు బిగ్ బాస్ చివరి వారం వరకూ ఉండే అవకాశం ఉంది.. ఆ లెక్కన్న వీరిద్దరికి కోటిన్నరకు పైగా ఇవ్వక తప్పదు. ప్రస్తుతం వీరితో చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ.. ఈసారి బిగ్ బాస్ మాత్రం రసవత్తరంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ను టీమ్ ఏరేంజ్ లో ప్లాన్ చేస్తారో చూడాలి. బిగ్ బాస్ లవర్స్ మాత్రం ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. లాస్ట్ సీజన్ లా.. ఈసారి కూడా అగ్నిపరీక్ష కాన్సెప్ట్ తో.. సామాన్యులను బిగ్ బాస్ లోకి పంపించబోతున్నారు. ఈ ఈవెంట్ కూడా త్వరలో స్టార్ట్ అవ్వబోతున్నట్టు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories