Singer Jhansi: రైతు నుంచి ఫోక్‌ సింగర్‌గా, అవమానాలు దాటుకొని బిగ్‌ బాస్‌లోకి.. సింగర్‌ ఝాన్సీ బ్యాక్‌ గ్రౌండ్‌

Published : Sep 06, 2026, 08:06 PM IST

కామనర్‌ విభాగంలో వచ్చి అగ్నిపరీక్షలో సత్తా చాటి బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెట్టింది సింగర్‌ ఝాన్సీ. మరి ఆమె నేపథ్యం ఏంటి? ఏం చేస్తుంది? ఆమె పాపులారిటీ ఏంటనేది తెలుసుకుందాం.

PREV
16
బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి కామనర్‌ సింగర్‌ ఝాన్సీ

బిగ్‌బాస్‌ తెలుగు 10వ సీజన్‌ గ్రాండ్‌ ప్రారంభమయ్యింది. ఈ సారి కామనర్ల నుంచి వచ్చిన కంటెస్టెంట్లపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అగ్నిపరీక్ష సీజన్‌ 2లో విజేతగా నిలిచి బిగ్‌బాస్‌ తెలుగు 10 హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ సంపాదించిన వారిలో జానపద గాయని ఝాన్సీ ఒకరు. బిగ్‌ బాస్‌ తెలుగు 10 లోకి వెళ్లేందుకు కన్ఫమ్‌ అయిన తొలి కంటెస్టెంట్‌ సింగర్‌ ఝాన్సీ కావడం విశేషం. అగ్నిపరీక్షలో తన టాలెంట్‌, ఎనర్జీతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లో తన ఆట ఎలా ఆడబోతుందన్నది ఆసక్తిగా మారింది.

26
సూర్యాపేట జిల్లా నుంచి బిగ్‌బాస్‌ వరకు..

ఝాన్సీ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామానికి చెందినవారు. ఆమె అసలు పేరు గుండెబోయిన ఝాన్సీ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచి కుటుంబానికి సహాయం చేస్తూ పొలం పనుల్లోనూ పాల్గొనేవారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ పాటలంటే ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండేది. ఎలాంటి పెద్ద సంగీత కుటుంబం, బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండానే తన ప్రతిభతో జానపద గాయనిగా ఎదిగారు. 3వ తరగతి నుంచే పాటలపై ఆసక్తిని చూపించారు. స్కూల్స్ లో పాటలు పాడుతుంటే టీచర్స్ ఎంకరేజ్‌ చేసేవారు. అలా ఓ సారి ప్రముఖ సినీ రచయిత సుద్దాల అశోక్‌ తేజ కంటపడ్డారు. స్టేజ్‌పై ఆమె పాడిన పాట విని ముద్గుడైన అశోక్‌ తేజ అదే స్టేజ్‌పై ఆమెని అభినందించడం విశేషం. అలా పాటని, వ్యవసాయాన్ని నమ్ముకొని రాణిస్తున్నారు. జానపద పాటలతో ఆకట్టుకుంటున్నారు. సెల్ఫ్‌ మేడ్ ఫోక్‌ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకొని సోషల్‌ మీడియాని వాడుకొని పాపులర్‌ అయ్యారు.

36
చదువులోనూ ఝాన్సీ టాపర్‌!

ఝాన్సీ గురించి ఆసక్తికరమైన విషయం ఆమె విద్యాభ్యాసం. వ్యవసాయ పనులు చేస్తూనే చదువుపై కూడా దృష్టి పెట్టింది. ఇంటర్‌లో 926 మార్కులు సాధించడం విశేషం. అనంతరం ఆర్గానిక్‌ కెమిస్ట్రీలో పీజీ పూర్తి చేసింది. ఇప్పుడు ఒకవైపు పొలం పనులు, మరోవైపు చదువు, ఇంకోవైపు పాటలు.. ఇలా తన జీవితంలో ఎన్నో బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. తండ్రికి సపోర్ట్ గా, కుటుంబానికి అండగా నిలుస్తోంది.

46
జానపద పాటలతో గుర్తింపు

ఝాన్సీకి అసలు గుర్తింపు తెచ్చింది ఆమె జానపద గాత్రం. తెలంగాణ పల్లె జీవితం, మట్టి వాసన, గ్రామీణ సంస్కృతి ప్రతిబింబించే పాటలను తనదైన మాస్‌, ఎనర్జిటిక్‌ వాయిస్‌తో పాడుతూ సోషల్‌ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘రామ్‌రెడ్డి దొర’, ‘అడ్డా బాటలకాడ నల్ల సారంగులయ్య’, ‘అందాల రాధ’, ‘కాసరం కట్ట’ వంటి జానపద పాటలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఈ పాటలు, ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, సోషల్‌ మీడియా ప్రదర్శనలతో ఆమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ ఏర్పడింది. పాటలు పాడటంతో పాటు రైతుల జీవితం, పొలాల్లో వారి కష్టాలను వివరిస్తూ చేసిన వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఆమె కేవలం సింగర్‌గా మాత్రమే కాకుండా ‘రైతుబిడ్డ’గా కూడా గుర్తింపు పొందారు. అయితే రైతు బిడ్డ అనే సింపతి కార్డ్ వాడుతుందనే విమర్శలు, ట్రోల్స్ వచ్చిన నేపథ్యంలో వాటిని తిప్పికొట్టి ఆమె తన టాలెంట్‌తో దూసుకుపోవడం విశేషం. అయితే తనకంటూ సొంతంగా యూట్యూబ్‌ ఛానెల్‌ని ప్రారంభించి దాని ద్వారా ప్రజలకు తన పాటలను వినిపిస్తుంది. దీని ద్వారా ఆమె అంతో కొంత ఆదాయాన్ని కూడా పొందుతుంది.

56
అగ్నిపరీక్షలో సత్తా.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ

బిగ్‌బాస్‌ తెలుగు 10లో కామనర్లకు అవకాశం కల్పించేందుకు నిర్వహించిన అగ్నిపరీక్ష సీజన్‌ 2లో ఝాన్సీ పాల్గొన్నారు. 15 మంది పోటీదారుల మధ్య జరిగిన వివిధ టాస్కుల్లో తన ప్రతిభను చూపించి చివరకు విజేతగా నిలిచారు. దీంతో బిగ్‌బాస్‌ తెలుగు 10 మెయిన్‌ హౌస్‌లోకి నేరుగా ఎంట్రీ పొందారు. ఇప్పటివరకు జానపద పాటలతో ప్రేక్షకులను అలరించిన ఝాన్సీ.. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన మాటతీరు, వ్యక్తిత్వం, టాస్కుల్లో పోరాట పటిమతో ఎంతవరకు ఆకట్టుకుంటారన్నది చూడాలి. సూర్యాపేటలోని ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి మొదలైన ఆమె ప్రయాణం.. జానపద గాయనిగా ఎదిగి, అగ్నిపరీక్ష విజేతగా నిలిచి, ఇప్పుడు బిగ్‌బాస్‌ తెలుగు 10 హౌస్‌ వరకు చేరడం నిజంగా ఆసక్తికరమైన ప్రయాణంగా చెప్పుకోవచ్చు. అయితే బిగ్‌ బాస్‌ కప్పే లక్ష్యంగా తాను గేమ్‌ ఆడతానని, ఆ విషయంలో తనకు ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని, ఓటు వేసి ఆదరించాలని వేడుకున్నారు. అదే సమయంలో సినిమా ఛాన్స్ లే లక్ష్యంగా తాను బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి అడుగుపెడుతోంది. తన పాట పల్లెటూరికే పరిమితం కాకుండా వెండితెరపై కూడా ఆదరణ పొందాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతుంది. మరి బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఆమె ఎంత వరకు సత్తా చాటుతుందనేది చూడాలి.

66
పొలంలోనే కాదు బిగ్‌ బాస్‌ హౌజ్‌లోనూ ఆటాడిస్తా

సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తూ అదిరిపోయే కామెంట్స్ చేశారు. పొలంలో మందు చల్లే సమయంలో ఓ దశలో ఆగిపోతాము, అలసిపోతాము. కానీ నేను ఆగిపోతే నాన్న బాధపడతాడని చెప్పి, ఓపిక తెచ్చుకుని తనని తాను మోటివేట్‌ చేసుకుంటూ పని పూర్తి చేసేదాన్ని అని, మధ్యలో వదిలేయడం తనకు రాదు అని, అలాగే బిగ్‌ బాస్‌ హౌజ్‌లో కూడా గట్టి కాంపిటీషన్‌ ఇస్తానని, వెనక్కి తగ్గేదెలేదు అని తెలిపింది. పొలంలోనే కాదు, హౌజ్‌లోనూ ఆటాడిస్తానని తెలిపింది. నాగార్జున ముందు ఓ పాట పాడి అలరించింది సింగర్‌ ఝాన్సీ.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories