త్రిగుణ్ సినీ ప్రయాణం 2009లో విడుదలైన ‘కథ’ సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో కృష్ణ పాత్రలో నటించారు. ప్రకాశ్‌రాజ్‌తో జరిగిన ఆడిషన్ ద్వారా ఆయనకు ఈ అవకాశం లభించింది. ఆ తర్వాత తమిళంలో ‘ఇనిదు ఇనిదు’, ‘తనీర్ విధూతి’ వంటి సినిమాల్లో నటించారు. తెలుగులో ‘వీకెండ్ లవ్’, ‘తుంగభద్ర’, ‘L7’, ‘మనసుకు నచ్చింది’, ‘24 కిస్సెస్’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘డియర్ మేఘ’, ‘WWW’, ‘కథ కంచికి మనం ఇంటికి’, ‘కొండ’, ‘ప్రేమదేశం’ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘కొండ’ సినిమాలో కొండా మురళి పాత్ర పోషించడం ఆయన చేసిన కొత్త ప్రయత్నంగా చెప్పొచ్చు.