Bigg Boss 10: ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌, దక్షితోపాటు షాలిని ఎలిమినేట్‌.. కారణం ఇదే

Published : Oct 25, 2026, 12:20 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగిందట. ఇప్పటికే దక్షి ఎలిమినేట్‌ అయ్యిందని టాక్‌. ఇప్పుడు షాలినిని కూడా ఎలిమినేట్‌ చేశారట. లేటెస్ట్ సమాచారం షాకిస్తోంది.

PREV
14
బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఏడో వారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. కంటెంస్టెంట్లని ఆడుకున్నారు. బాగా ఆడిన వారిని ప్రశంసించారు. నరేష్‌, దేబ్జానీ, అమన్‌లపై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో వర్షిణి, ముఖేష్‌, త్రిగుణ్‌, షాలిని, రోహిత్‌లను ఆడుకున్నాడు. ముఖ్యంగా షాలిని, రోహిత్‌లకు చుక్కలు చూపించాడు నాగార్జున. అదే సమయంలో రెడ్‌ జోన్‌లో ఉన్న వారి విషయంలో సర్‌ప్రైజ్‌ ఉంటుందన్నారు. తాజాగా వారిలో నుంచి ఒకరిని ఎలిమినేట్‌ చేశారట. ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్ ఉందట.

24
దక్షి ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ ఉందట. ఈ వారం రోహిత్‌, త్రిగుణ్‌, రామకృష్ణ, అమన్‌, స్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్‌ వంశీ, సుధీర్‌, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్‌ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఓటింగ్‌ ప్రకారం ఇప్పటికే దక్షి ఎలిమినేట్‌ అయ్యింది. ఆడియెన్స్ ఓటింగ్‌ ద్వారా తక్కువ ఓట్లు వచ్చిన దక్షిని ఎలిమినేట్‌ చేశారట. అయితే ఈ వారం ఒక్క ఎలిమినేషనే ఉంటుందనుకున్నారు. కానీ శనివారం ఎపిసోడ్‌లోనే నాగ్‌ హింట్‌ ఇచ్చాడు. ఇప్పుడు దక్షితోపాటు మరో ఎలిమినేషన్‌ కూడా ఉందట.

34
షాలిని సడెన్‌ ఎలిమినేషన్‌

ఆరో వారం ఎలిమినేషన్‌ లేదు. షాలిని ఎలిమినేట్‌ కావాల్సింది. కానీ ఆమెని సీక్రెట్‌ రూమ్‌కి పంపించారు. బిగ్‌ బాస్‌ ఆమెకి మరో ఛాన్స్ ఇచ్చారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదు. మాటలతో విరుచుపడింది. తన ఆరొగెంట్‌ బిహేవియర్‌తో రచ్చ చేసింది. దీంతో శనివారం ఎపిసోడ్‌లోనే మరోసారి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. ఇక షాలిని రెడ్‌ జోన్‌లో ఉంది. రోహిత్‌, సింగర్‌ ఝాన్సీ, షాలిని వంటి వారు రెడ్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో నుంచి హౌజ్‌మేట్స్ ఓటింగ్‌ ద్వారా మరో ఎలిమినేషన్‌ చేశారట. ఈ క్రమంలో షాలినికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆమెని ఎలిమినేట్‌ చేసినట్టు సమాచారం.

44
ఏడో వారం హౌజ్‌ని వీడిన దక్షి, షాలిని.. కారణం ఇదే

ఆరో వారంలో మిస్‌ అయిన షాలిని ఇప్పుడు ఏడో వారంలో హౌజ్‌ని వీడిందని సమాచారం. బిగ్‌ బాస్‌ ఛాన్స్ ఇచ్చినా కూడా ఉపయోగించుకోలేకపోయింది షాలిని. మళ్లీ అదే తప్పు చేసింది. మొత్తంగా ఎలిమినేట్‌ అయ్యింది. దీంతో ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన దక్షి ఏమాత్రం తన ప్రభావం చూపించలేకపోయింది. కంటెంట్‌ ఇవ్వలేకపోయింది. దీంతో ఆమెని ఆడియెన్స్ ఇంటి నుంచి పంపిస్తే, తన ప్రవర్తన కారణంగా హౌజ్‌మేట్స్ షాలినిని హౌజ్‌ నుంచి పంపించారు. మొత్తంగా ఏడో వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగిందని సమాచారం. దీనిపై అధికారికంగా మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories