Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?

Published : Sep 25, 2026, 08:58 AM IST

Bigg Boss 10: మూడో వారంలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. అనధికారిక ఓటింగ్‌, పోలింగ్‌ ప్రకారం సంచలన కంటెస్టెంట్ డేంజర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ కంటెస్టెంట్‌ ఎవరనేది చూస్తే.

PREV
15
బిగ్‌ బాస్‌ తెలుగు 10లో ట్విస్ట్ లు

బిగ్‌ బాస్‌ తెలుగు 10వ సీజన్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమనే చెప్పొచ్చు. బిగ్‌ బాస్‌ ఇస్తున్న ట్విస్ట్ లు ఆశ్చర్యపరుస్తున్నాయి. మొదటివారం మధ్యలోనే ఇద్దరిని ఎలిమినేట్‌ చేసి షాకిచ్చారు. ఆ తర్వాత ఒకరిని ఓటింగ్‌ ద్వారా మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు. చరణ్‌ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. చైత్ర రాయ్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఇక రెండో వారంలో కృష్ణుడు హౌజ్‌నీ వీడాడు. ఇప్పుడు మూడో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇప్పిస్తున్నారు. రామకృష్ణ, మిథిలేష్‌, అపూర్వలను హౌజ్‌లోకి తీసుకొచ్చారు. ఇందులో అపూర్వ ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం.

25
మూడో వారంలో నామినేషన్స్ లో ఉన్నది వీరే

మరి మూడో వారం ఎలిమినేషన్‌ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో త్రిగుణ్‌, సుధీర్‌, వర్షిణి, చరణ్‌, అమన్, షాలిని, వంశీ, సింగర్‌ ఝాన్సీ. వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వారం ఒక క్రేజీ, సంచలన కంటెస్టెంట్ లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అనధికారికంగా పలువురు బిగ్‌ బాస్‌ లవర్స్, సోషల్ మీడియా ద్వారా పోలింగ్‌ నిర్వహించారు. ఇందులో షాకింగ్‌ రిజల్ట్ కనిపిస్తోంది.

35
డేంజర్‌ జోన్‌లో సింగర్‌ ఝాన్సీ

మూడో వారం సింగర్‌ ఝాన్సీ లీస్ట్ లో ఉన్నారు. ఆమె నాలుగు శాతం ఓట్లే వచ్చాయి. రెండు మూడు రెగ్యూలర్ పోలింగ్‌ సోషల్‌ మీడియా అకౌంట్లలోనూ ఆమెకి తక్కువగా ఓటింగ్‌ ఉండటం ఆశ్చర్యపరుస్తోంది. ఆ తర్వాత వర్షిణి ఉంది. అలాగే షాలిని, అలాగే టెంపర్‌ వంశీ ఉన్నారు. వీరి మధ్య ఓటింగ్‌ తేడా స్వల్పంగా ఉంది. మొత్తంగా సింగర్‌ ఝాన్సీ, షాలిని, వర్షిణి ఈ వారం డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో వంశీ కూడా ఈ జాబితాలోనే ఉన్నారని చెప్పొచ్చు.

45
టాప్‌లో త్రిగుణ్‌

ఇక గత వారం లీస్ట్ లో ఉన్న సుధీర్ ఇప్పుడు పుంజుకున్నాడు. అయినకు అనూహ్యమైన ఓటింగ్‌ వస్తోంది. టాప్‌ 2లోకి వెళ్లిపోయాడు. ఇక మొదటి స్థానంలో త్రిగుణ్‌ ఉన్నాడు. ఆయనకు ఊహించని ఓటింగ్‌ వస్తోంది. నలభై శాతానికిపైగా ఓటింగ్‌ రావడం విశేషం. అమన్‌ మూడో స్థానంలో, చరణ్‌ నాల్గో స్థానంలో ఉన్నారు. మొత్తంగా మూడో వారం ఎలిమినేషన్‌ అసక్తికరంగా, రసవత్తరంగా ఉండబోతుందని తెలుస్తోంది.

55
సింగర్ ఝాన్సీపై కావాలనే నెగటివ్‌ చేస్తున్నారా?

ఇదిలా ఉంటే సింగర్‌ ఝాన్సీకి ఇంత తక్కువ ఓట్లు రావడం ఆశ్చర్యపరుస్తోంది. కావాలనే ఆమెపై నెగటివ్‌ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. హౌజ్‌లోనే చాలా మంది కంటెస్టెంట్లు ఆమెని టార్గెట్‌ చేస్తున్నారు. రైతు బిడ్డ ట్యాగ్ వాడుతుందని, సింపతీ పొందే ప్రయత్నం చేస్తుందని కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలోనూ అదే జరుగుతుంది. దీంతో కొందరు ఆమెని టార్గెట్‌ చేసి ఇలా ట్రోల్‌ చేస్తున్నారని, నెగటివ్‌ చేస్తున్నారనే ప్రచారం ఉంది. మరి వాటిని దాటుకొని ఝాన్సీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి. ఎలిమినేషన్‌కి సంబంధించి శనివారం సాయంత్రానికి క్లారిటీ రానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories