ఛీ ఛీ ఫీలింగ్స్ చచ్చిపోయాయి.. పెళ్లిపై బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీ సత్య బోల్డ్ కామెంట్, ఇంత ఓపెన్‌గానా?

Published : Aug 05, 2025, 10:34 PM IST

బిగ్‌ బాస్‌ ఫేమ్‌ శ్రీ సత్య.. పెళ్లి గురించి షాకింగ్‌ కామెంట్‌ చేసింది. పెళ్లి చేసుకోనూ అంటూ ఆమె వెల్లడించింది. అందుకు కారణం ఏం చెప్పిందంటే? 

PREV
15
`బిగ్‌ బాస్‌ తెలుగు 6`తో పాపులర్‌ అయిన శ్రీ సత్య

`బిగ్‌ బాస్‌`తో గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో శ్రీసత్య ఒకరు. ఆమె అంతకు ముందు సినిమాల్లో, సీరియల్స్ లో నటించింది. కానీ బిగ్‌ బాస్‌ షో ఆమెకి మంచి గుర్తింపు తెచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొంది. దాదాపు చివరి వారం వరకు హౌజ్‌లో ఉంది. చూడ్డానికి క్యూట్‌గా ఉన్నా, హౌజ్‌లో మాత్రం రచ్చ చేసింది. తన ప్రత్యర్థి కంటెస్టెంట్లకు చుక్కలు చూపించి చివరి వరకు నిలబడింది. బిగ్‌ బాస్‌ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్‌ అయ్యింది.

DID YOU KNOW ?
శ్రీసత్య ఫ్యామిలీ కష్టాలు
శ్రీసత్య తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కూర్చోలేని, నడవలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం బెడ్‌ కే పరిమితమయ్యింది.
25
డాన్స్ వీడియోలతో హల్‌ చల్‌ చేస్తున్న శ్రీసత్య

బిగ్‌ బాస్‌ షో చాలా మందికి లైఫ్‌ ఇచ్చింది. సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. కానీ శ్రీసత్యకి పెద్దగా ఆఫర్లు రాలేదు. యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ రాణిస్తుంది. అడపాదడపా వెబ్‌ సిరీస్‌లో కనిపిస్తోంది. అలాగే టీవీ షోస్‌లో మెరుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్లిపై స్పందించిన శ్రీసత్య.. హాట్‌ కామెంట్‌ చేసింది. పెళ్లి గురించి యాంకర్‌ అడగ్గా, ఛీ ఛీ అంటూ రియాక్ట్ కావడం షాకిస్తోంది.

35
పెళ్లిపై శ్రీ సత్య షాకింగ్‌ కామెంట్స్

ఐడ్రీమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి శ్రీ సత్య ఇలా రియాక్ట్ అయ్యింది. పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించాడు యాంకర్‌ శివ. దీనికి క్షణం కూడా ఆలస్యం లేకుండా ఛీ ఛీ అంటూ రియాక్ట్ అయ్యింది శ్రీసత్య. ఆమె రియాక్షన్‌కి యాంకర్‌ కూడా షాక్‌ అయ్యాడు. ఏంటి పెళ్లి చేసుకోవా? అని అడగ్గా, నో .. నో నో అని చెప్పింది. అసలుకే పెళ్లి చేసుకోను అని స్పష్టం చేసింది. మా అమ్మా నాన్నతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పెళ్లెందుకు అని రివర్స్ క్వచ్ఛన్‌ వేసింది. బాగా చూసుకుంటానని శివ అడగ్గా, బాగా చూసుకోకపోతే మళ్లీ ఏడవాలి కదా అని చెప్పింది.

45
ఫీలింగ్స్ చచ్చిపోయాయి, కొరియన్స్ అయితే ఓకే

పెళ్లిపై ఆసక్తి లేదని, ఫీలింగ్స్ చచ్చిపోయానని తెలిపింది శ్రీసత్య. ఈ సందర్భంగా మరో షాకింగ్‌ విషయం వెల్లడించింది. కొరియన్‌ అయితే ఓకే అని చెప్పింది. ఈ కొరియన్‌ పిచ్చి ఏంటని యాంకర్‌ శివ అడగ్గా, కే డ్రామాలు ఎక్కువగా చూడటం వల్ల వాళ్లు నచ్చుతున్నారని తెలిపింది. కొరియన్స్ బాగుంటారని, ఆడవారిని బాగా ట్రీట్‌ చేస్తారని తెలిపింది. మొత్తానికి పెళ్లిపై శ్రీ సత్య కామెంట్స్ అందరికీ షాకిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్‌ వైరల్‌ అవుతుంది.

55
శ్రీ సత్య ఫ్యామిలీ కష్టాలు

ఇక శ్రీసత్యకి తండ్రి, తల్లి ఉన్నారు. తల్లి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె కూర్చోలేని, నడవలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం బెడ్‌ కే పరిమితమయ్యింది. ప్రతి నెల మెడిసిన్‌కే చాలా ఖర్చు అవుతుంటాయని, తన కుటుంబానికి తానే ఆధారమని బిగ్‌ బాస్‌ షోలో తెలిపింది శ్రీసత్య. ఆ సమయంలో తన ఫ్యామిలీ బాధలు పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యింది. మరోవైపు లవ్‌ లోనూ ఫెయిల్‌ అయినట్టు తెలిపింది. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తాజా ఇంటర్వ్యూని బట్టి అర్థమవుతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories