టాలీవుడ్ లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన శివాజీ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 7లో అలరించాడు. టాప్ 3 గా నిలిచి తృటిలో టైటిల్ మిస్సయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోపల శివాజీ తనకంటూ ఒక గ్యాంగ్ మైంటైన్ చేశాడు. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ఇలా టివి సెలెబ్రిటీలు ఒక గ్రూప్ గా ఉంది గేమ్ ఆడుతుండడంతో శివాజీ వాళ్ళని ఎదుర్కొనేందుకు తాను కూడా గ్రూప్ ఫామ్ చేశాడు.