బిగ్ బాస్ హౌస్లో అతడితో ప్రేమ?... మొదటిసారి అత్తారింటికి వెళ్లిన శుభశ్రీ!

First Published | Dec 23, 2023, 4:15 PM IST

శుభశ్రీ మొదటిసారి అత్తారింటికి వెళ్ళింది. ఆమెకు చికెన్, మటన్ బిర్యానీలతో విందు చేశారు. ఇంతకీ శుభశ్రీ ఎవరింటికి వెళ్ళింది? అత్తారిల్లు అని ఎందుకు అనాల్సి వస్తుందో చూద్దాం?
 


మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 7లో 19 మంది కంటెస్ట్ చేశారు. వారిలో శుభశ్రీ రాయగురు ఒకరు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ లాయర్. మోడల్ అండ్ యాక్ట్రెస్ కూడాను. శుభశ్రీ తన క్యూట్ మాటలతో హౌస్లో ఆకట్టుకుంది. 

అనూహ్యంగా శుభశ్రీ 4వ వారమే ఎలిమినేట్ అయ్యింది. ఉన్నన్ని రోజులు గౌతమ్ ఆమెకు లైన్ వేశాడు. శుభశ్రీతో మాట్లాడేందుకు, ఆమె ప్రక్కన కూర్చునేందుకు గౌతమ్ ఇష్టపడేవాడు. వీలు కుదిరినప్పుడల్లా పులిహోర కలిపేవాడు. 


శుభశ్రీ కూడా ఇష్టపడింది. అయితే ఆమె ఓపెన్ కాలేదు. మంచిగా మాట్లాడినప్పటికీ హద్దులు దాటేది కాదు. ఇంకొన్ని వారాలు ఉంటే దగ్గరయ్యే వారేమో కానీ శుభశ్రీ త్వరగా ఎలిమినేట్ అయ్యింది. 

ఇక 13వ వారం ఎలిమినేట్ అయిన గౌతమ్... బయటకు వెళ్ళాక శుభశ్రీని కలుస్తాను అన్నాడు. ఇటీవల బిగ్ బాస్ షో ఇటీవల ముగిసింది. తాను ఎంతగానో అభిమానించే ప్రియాంక కూడా బయటకు వచ్చింది. 
 

Subhashree Rayaguru

ఈ సందర్భంగా గౌతమ్ డిన్నర్ పార్టీ ఇచ్చాడు. గౌతమ్ ఇంట్లో జరిగిన డిన్నర్ నైట్ కి శుభశ్రీ హాజరైంది. చికెన్, మటన్ ,  ప్రాన్స్ తో పాటు పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో అద్భుతమైన విందు ఏర్పాటు చేశాడట. గౌతమ్ తల్లికి శుభశ్రీని పరిచయం చేశాడట. 

శుభశ్రీని గౌతమ్ బిగ్ బాస్ హౌస్లో ఇష్టపడిన నేపథ్యంలో ఆమె అత్తారింటికి మొదటిసారి వెళ్ళిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ పార్టీలో మరికొందరు కంటెస్టెంట్స్ కూడా పాల్గొన్నారు. 

యావర్, తేజ, ప్రియాంక, నయని పావని, అర్జున్, యావర్ బ్రదర్, ప్రియాంక లవర్ శివ కుమార్ కూడా హాజరయ్యారు. డిన్నర్ అనంతరం డాన్స్ లు వేసి ఎంజాయ్ చేశారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గౌతమ్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. 

Latest Videos

click me!