హీరోయిన్లకు, ఇతర నటీమణులకు సినిమాలు, బుల్లితెర కార్యక్రమాలు మాత్రమే ఆదాయమార్గం కాదు. అనేక వాణిజ్య ప్రకటనలు చేస్తుంటారు. వాణిజ్య ప్రకటనల ద్వారా లక్షలు, కోట్లు గడిస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో చేసే ప్రమోషన్స్ కి కూడా మంచి ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రియాంక చోప్రా లాంటి గ్లోబల్ స్టార్స్ తమ ఇంస్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కి కోట్లాది రూపాయలు తీసుకుంటారు.