బయటపడ్డ టేస్టీ తేజా- శోభా శెట్టి ఎఫైర్, ప్రియుడు యశ్వంత్ ఫైర్, పెళ్లి క్యాన్సిల్... భోరున ఏడ్చిన లేడీ విలన్ 

First Published | Jan 31, 2024, 11:07 AM IST

శోభ శెట్టి-యస్వంత్ రెడ్డి ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. టేస్టీ తేజాతో శోభకు ఎఫైర్ ఉందని నమ్ముతున్న యశ్వంత్ ఆమెకు ఉద్వాసన పలికాడట. 
 

Shobha Shetty


బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో శోభ శెట్టి ఒకరు. బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీక దీపంలో లేడీ విలన్ మోనితగా ఈమె బాగా పాప్యులర్. రియల్ గా కూడా శోభ విలనే అని హౌస్లో ఆమె ప్రవర్తనతో రుజువైంది. యాటిట్యూడ్ చూపిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడేది. 

Shobha Shetty

శోభ శెట్టి ఓవరాక్షన్ జనాలు భరించలేకపోయారు. సోషల్ మీడియాలో ఆమెను ఎలిమినేట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అయితే స్టార్ మా ఆమెను కాపాడుతూ వచ్చిందనే వాదన ఉంది. 14వ వారం శోభ శెట్టి ఎలిమినేట్ అయ్యింది. 


Shobha Shetty


ఒక దశలో వీరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందేమో అనే సందేహాలు ఏర్పడ్డాయి. శోభ శెట్టికి చాలా కాలంగా ప్రియుడు ఉన్నాడు. సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డితో ఆమె రిలేషన్ లో ఉంది. టేస్టీ తేజాతో తన బంధాన్ని యశ్వంత్ అపార్థం చేసుకుంటాడేమో అనే సందేహాన్ని శోభ శెట్టి ఓ సందర్భంలో బయటపెట్టింది. 

Shobha Shetty

అనుకున్నదంతా అయ్యింది. ఎంగేజ్మెంట్ కూడా ముగిశాక శోభా-తేజ మధ్య ఎఫైర్ ఉందని యశ్వంత్ నమ్ముతున్నాడట. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయట. పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందట. ఈ విషయాన్ని ఫోన్ చేసి టేస్టీ తేజాకు శోభ చెప్పింది. 

Shobha Shetty

నువ్వు మన గురించి బయట తప్పుగా చెబుతున్నావట. మన స్నేహాన్ని యశ్వంత్ అపార్థం చేసుకున్నాడు. అంతా నీ వల్లే అని బోరున ఏడ్చింది. నువ్వు ఎలాంటి అమ్మాయివో యశ్వంత్ కి తెలుసు. నీ గురించి అలా తప్పుగా ఆలోచిస్తాడని నేను అనుకోను అని తేజ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. 

Bigg Boss Telugu 7


కాసేపు తేజను టెన్షన్ పెట్టిన శోభ... ఇదంతా ఫ్రాంక్ అని డ్రామాకు తెరదింపింది. కేవలం నిన్ను భయపెట్టేందుకు చేసిన ఫ్రాంక్ అని రివీల్ చేసింది. దాంతో టేస్టీ తేజ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే జనాలు వీళ్ళను బూతులు తిడుతున్నారు. 

Shobha Shetty engagement

ప్రియాంక ఇంట్లో టేస్టీ తేజకు గుండెపోటు వచ్చినట్లు ఒక ఫ్రాంక్ వీడియో చేసి వదిలారు. తాజాగా శోభ-యశ్వంత్ విడిపోతున్నారంటూ... మరో ఫ్రాంక్ వీడియో. వ్యూస్ కోసం జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. 

Latest Videos

click me!